నేటినాయకత్వం,
సి. శేఖర్(సియస్సార్),
నడిపించేవాడు నాయకుడు
నవ్వులాట కాదది
అహంకారం కాదది
హుందాతనం గౌరవ బావం
వేసే ప్రతి అడుగు అందరికోసమవ్వాలి
సొంతంగా సాగిపోతూ
విజయం పొందే నేర్పుండాలి
ఆధారపడ్డావో
అక్కడే నీవోడిపోయావ్
స్నేహంతో మెలిగితే అందరివాడవౌవుతావ్
కొందరినే చేరదీస్తే చదలపట్టుకుపోతావ్
ఎందుకంటే
కాలప్రవాహం ఆగదు
కొట్టుకుపోతావ్
నీకంటూ గుర్తింపెక్కడ
చిల్లరమాటల్లోనా లేక ఆటల్లనా?
నాయకత్వమంటే సమానత్వం
సౌజన్యభావన
ఏకతాటిపై నడిపించడం
సూటిపోటి మాటలతో విడగొట్టి వినోదం చూడడకాదు
అప్పుడది చేతకానితనాని నిదర్శనం
వివాదాలు సృష్టించడంకాదు
వితండవాదం వినోదం కాదు
నలుగురు చుట్టూ కాపలావుంటే గాని
నడకసాగనిదయ్యింది నాయకత్వం
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.