భార్య భర్తల బంధం --డా విడి రాజగోపాల్

భార్య భర్తల బంధం --డా విడి రాజగోపాల్


భార్య భర్తల బంధం

భార్య భర్తల బంధం ఎంత పవిత్రం
భారతంలో ద్రౌపది ఏమంటుందొ తెలుసుకుందాం....

అవి పాండవులు అరణ్యవాసపు రోజులు
వారిని పలకరించ  పాండవుల బాసటగా నిలచిన  కృష్ణయ్య ఏతెంచె ఇష్టసఖి సత్యభామతో.....

వీరిని చూచినంతనే ఆనంద పరవశులైరి
ఆ పాండవులు
కుశలప్రశ్నలతో కాసేపు గడచింది

సత్యభామ  ద్రౌపదితో పిచ్చాపాటిన సంధించిన ప్రశ్నలు 
ఒక స్త్రీలో సహజంగా ఉండే  ఈర్ష్యా ద్వేషాలు  ప్రస్పుటం చేసే ప్రశ్నలు

సత్యభామ స్వాతిశయం అహంకారం
తనో అందకత్తెనని,
ఇక్కడ ద్రౌపది కూడ సౌందర్యవతే
తన ఈర్ష్యకు అది ఒక కారణం,
ఆ శ్రీకృష్ణుడు తన అందానికి  దాసుడనే
భ్రమలో ఎప్పుడూ ఉంటుంది,
తులాభారంతో ఆ గర్వం సుతిమెత్తగా అణుగుతుంది,

ఆపదలో నున్న వారిని పరామర్శించడం
ఓ కర్తవ్యం
అట్టి పరామర్శకు వచ్చి
వీలైనంత వరకు వారిని ధైర్య పరచే పలుకులు పలకాలి

కానీ సంత్యభామ సంధించిన ప్రశ్నలు
ఏమిటో చూద్దాం
ద్రౌపది ఏమి నీ చాకచక్యం
మీ ఐదుగురు పతులను నీ మాటమీరని పతులుగా ఎలా చేయగలిగావు
నీ అందాన్ని విందుచేశావా?
లేక ఏమైన మందో మాకో పెట్టావా?
ఏమిటీ రహస్యం చెప్పవా ? అంటుంది

ద్రౌపది నిశ్ఛేష్టురాలైంది
ఒకవైపు తను ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్మ
ఇష్ట సఖి  సత్యభామ
ఇలా అర్ధం పర్ధం లేని ప్రశ్నలు సంధించింది

అయినా కురుసభలో మేధావులను
తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వనిత
ద్రౌపది
భీష్ముడు సైతం ద్రౌపది ప్రశ్నలకు మౌనం వహిస్తాడు  
అటువంటి చతురత గల పడతి ద్రౌపది

సత్యభామ కొంటె ప్రశ్నలకు
గాంభీర్యాన్ని మేళవింపు చేసి
ద్రౌపది పలికిన పలుకులు
ఒక సత్యభామకే కాదు
యావత్ స్త్రీ జాతికే తలమానికాలు సుమా!

చూడు సత్యభామా
పురుషోత్తముని ఇల్లాలివి నీవు
నీవేనా ఈ ప్రశ్నలు వేసింది
ప్రేమను పొందడానికి ఔషధాలా
ప్రేమ త్యాగం  కోరుతుంది
భర్త బలహీనతలు భార్య బహిర్గతం చేయకూడదు
ఎప్పుడూ భర్త సంతోషం కోరాలి

ప్రేమ స్వచ్ఛందం
ప్రేమని నటించడం  ఎలా సాధ్యం
భర్తకు భార్య  తనను వశవర్తిని చేసుకునే ప్రయత్నం చేసుకున్నట్లు తెలిస్తే
ఆ దాంపత్యం విఫలం

భర్తను గురువుగా భావిస్తాను
నా భర్త నాకు చెప్ప తగిన వాడు
నేనూ చెప్పగలను అయితే వినయంగా సుమా!
నేను అహంకరించను ఎందుకంటే భర్త ఉద్ధారకుడు
భార్య కరణేషు మంత్రి  అన్నప్పటికీ కార్యేషుదాసి అన్నారు కదా!

భర్త మనసు గాయపడే విధంగా ప్రవర్తించను
భర్త వలనే అన్ని సుఖాలు పొందాను కనుక

అమర గంధర్వులెవరైన సరే నా భర్తకు సరికారనే భావన నాది

స్నానం భోజనం శయనం
భర్తలకన్నా ముందు చేయను
భర్త దేవతార్చనకు సిద్ధం చేయడం మరువను
భర్తకు స్వయంగా వండి పెట్టడం
వారు రుచికరంగా ఆరగిస్తుంటే మనసారా
తృప్తి పడటం భార్య కర్తవ్యం

తలవాకిట పనిలేకుండా నించొని  ఉండను
స్నేహం చెడువారితో చేయను
పోట్లాడటం  అసలే ఇష్ట ముండదు

హాస్యం తో ఎప్పుడూ ముచ్చటలాడను
భర్త  లేనపుడు అలంకారం చేయను
భర్త ఉన్నప్పుడు అలంకారం చేసుకోవడం మరవను

అత్త కుంతి  నాకు పృద్వి తో సమానం
అందుకే వారి సేవ చేయడం  కర్తవ్యంగా భావిస్తా!

భర్తతో పాటు సన్యాసులు ఎంతో మంది భోజనం చేస్తారు
విసుగు చూపను చిరునవ్వు వీడను
ఒక్క జాము నిదుర పోతా
భర్త మనసెరిగి మెసలుకుంటా

మందు మాకులతో కాదు మనసుతో కట్టివేస్తా
భర్త ఇచ్చేది అమితం
ఇతరులు ఇచ్చేది పరిమితం
భర్త బాగుంది అంటే మనసు ఉప్పొంగుతుంది

భర్త చెప్పిన రహస్యాలు బయట చెప్పకూడదు
భర్త అభ్యున్నతికి కారకులను దగ్గరకు తీసుకుంటా
నావాళ్ళైనా   భర్త అభ్యున్నతికి వ్యతిరేకులైతే ఆదరించను

ఈ మాటలు విన్న సత్యభామ దిమ్మ తిరిగింది
చాలా గొప్పగా చెప్పావు ద్రౌపది
నేను పరిహాసం ఆడినాననుకో అంటూ
ద్రౌపది ముందు ఎంత బేలనయ్యానని
లోలోన కుమిలింది

ఎదుటివారిని హేళనతో పలకరింపు
దాని పరిణామం చూశారు కదా!

చాగంటి వారినోట విన్నాను ఈ పలుకులు
మంచిని నలుగురికి పంచాలని
నా ప్రయత్నమే ఇది

డా విడి రాజగోపాల్
9505690590


0/Post a Comment/Comments