దిక్సూచి
అతడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట యోధుడు
అతడు తెలంగాణ ఉద్యమ దిక్సూచి
కన్నడంలో పుట్టి
మరాఠీ ని ముద్దాడి
తెలుగును ప్రేమించి
తెలంగాణ లో జీవించిన మేధావి
ప్రశ్న నే ఆయుధమై
తిరుగుబాటు కలమై
రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా
పొరుబాటబట్టి
నిజం నవాబునే ఎదిరించిన ధీశాలి
వందే మాతర ఉద్యమం లో
పీవీ వెంట నడచి
దేశభక్తి నర నరా న ఇమిడ్చుకున్న
అభినవ సర్ధార్
భూస్వామ్య వ్యవస్థను కూకటి వ్రేళ్ళతో పేకళించాలని
కష్ట జీవుల ఆకలి కేకలుఉండరా దాని గర్జించిన ప్రజా కవి
వలస వాదులను
ఆంధ్ర పెత్తం దారుల వైఖరిని
నిరసించిన తెలంగాణ వాది
ప్రజల సమస్యలే నాగోడవ అని
చట్ట సభల్లో అడుగు పెట్టటానికి
నిరంతర ము శ్రమించిన ఆశావాది
ప్రజాప్రతినిధి కాలేక పోయిన
ఆశయాల కోసం సాహితీ రణం చేసిన గొప్ప కవి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మే
తన ఆశ , శ్వాస అని తలచి
చెరసాలలో జీవితం గడిపిన త్యాగశీలి
గిడుగు వారితో అడుగులు వేసి
వ్యావహారిక భాష ప్రయాణం చేసిన
అభ్యుదయ కవి
పర భాష మోజులో
మాతృ భాషను విస్మరించిన వారికి
చురకలు అంటించి జ్ఞానోదయం చేసిన మాతృభాష ప్రేమ కవి
జీవితమంతా అన్యాయం పై ధిక్కారం
ప్రజాస్వామ్య అస్తిత్వ పోరాటాలతో
త్యాగం
అందుకే తెలంగాణ పద్మవిభూషణ్
ఆభరణాన్నీ అందించి
తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం పేరుతో స్మరిస్తుంది
కవి పేరు: సంకెపల్లి శ్రీనివాస రెడ్డి