మణి పూసలు --వల్లంభట్ల వనజ, అదిలాబాద్.

మణి పూసలు --వల్లంభట్ల వనజ, అదిలాబాద్.

మణి పూసలు :21-26

అజ్ఞానము తొలగించి
జ్ఞానమును ప్రసాదించి
సన్మార్గము చూపించే
గురువే మన దిక్సూచి!!

గురువు జాడ నడవాలి
అద్భుతంగ ఎదగాలి
గురువును మించు శిష్యులై
చరిత్రలోన నిలవాలి!!

పాటలెన్నో పాడాలి
ఆటలెన్నో ఆడాలి
ఆరోగ్యంగుంటు మనం
ఆనందమును పంచాలి!!

పుస్తకాలను చదవాలి
చదివిందంత రాయాలి
విజ్ఞానమే పెంచుకుంటు
పూర్ణ జ్ఞానం పొందాలి!!

గురువుబాట నడవాలి
అద్భుతంగ యెదగాలి
గురువు మించు శిష్యులై
చరిత్ర లోన నిలవాలి!!

కిలకిలనునీ నవ్వాలి
గలగలా మాట్లాడాలి
జలజలపారు నదిలాగ
బిరబిర పరుగు తీయాలి!!

      ✍🏻వల్లంభట్ల వనజ
               అదిలాబాద్

0/Post a Comment/Comments