కదం తొక్కిన కలం
నిజాం నిరంకుశత్వ పాలన ముగింపు కోసం
బడుగు జీవుల భుక్తి కోసం
కదం తొక్కింది కాళోజీ కలం
తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచడం కోసం
నైజాం పాలన కు ఎదురునిలిచి
కదం తొక్కింది కాళోజీ కలం
ప్రజల గోడును ప్రపంచానికి తెలియడం కోసం
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ
కదం తొక్కింది కాళోజి కలం
బానిస బ్రతుకుల విముక్తి కోసం
నవ తెలంగాణ నిర్మించడం కోసం
కదం తొక్కింది కాళోజీ కలం
అక్షరమే ఆయుధమై ప్రజా ఉద్యమానికి ఊతమై,
రజాకార్లపై ఎక్కుపెట్టిన బాణంలా
కదం తొక్కింది కాళోజి కలం
అన్యాయాన్ని ఎదిరించడం కోసం
సమాజ శ్రేయస్సు కోసం
కదం తొక్కింది కాళోజి కలం
తెలంగాణ నవ కవులకు మార్గమై
యువతకు గమ్యమై, తెలంగాణ భాషకు యాసకు వన్నె తెచ్చి
కదం తొక్కింది కాళోజి కలం
రాతలనే తూటాలతో ప్రశ్నించిన ప్రజా కవి కలం,
గొంతెత్తిన పద్మవిభూషణుడి గళం
దేశానికి అంకితం అన్న మహోన్నతుని జీవితం
--- ఐశ్వర్య రెడ్డి
Bagundi andi
ReplyDeletePost a Comment