బడినేస్తాల(కు) స్వాగతం ---వై.సుచరిత

బడినేస్తాల(కు) స్వాగతం ---వై.సుచరిత

బడినేస్తాల(కు) స్వాగతం 

---వై.సుచరిత


మధుమాసమొచ్చెనా
నా బడిమల్లెతోటకు
మల్లియలు మెరవగా
నా తరగతి నిండుగా
కొయ్యబల్లలన్నీ
కొండపల్లి బొమ్మలై
కూనిరాగాలు పాడగా
సుద్దముక్కలు
నందివర్దనాలై
నాట్యమాడసాగాయి.
గోడలపై అక్షరాలు
చిన్నారి నేస్తాల
హస్తస్పర్శకై
తహతహలాడుతున్నాయి
తరగతిగదులన్నీ
శానిటైజర్లకళ్ళాపి
చల్లుకొని
దోమల ధూపాన్ని
అత్తరు అద్దుకొని మరీ
కళ్ళల్లో వత్తులేసుకున్నాయి.
పచ్చని చెట్ల ఆకులన్నీ
తెగ అల్లరిచేస్తున్నాయి
మాస్కులున్న మీకు
ఆక్సిజన్ ఎక్కువ
అందిద్దామని.
సొగసులద్దుకున్న
బడిగుడి చిన్నారిదేవతల
ప్రతిష్ఠ కోసం వేగిరపడుతోంది.
సుద్దులు చెప్పే గురువులగుండెలు
మీ క్షేమం కోసం, చదువుకోసం
దేశ పురోగతికి మూలస్తంభాలై
ఆశీస్సులిస్తున్నాయి.


 -- యలగందుల సుచరిత, 

కవయిత్రి, 

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఖమ్మం.
0/Post a Comment/Comments