కళ - నైపుణ్యం నాణేనికి ఇరువైపులు
కళ ఒక అద్భుతవరం
కళ ఒక దైవ ప్రసాదం
కళ అబ్బడం ఒక పూర్వ జన్మ సుకృతం
కళ ఒక అదృష్టం
కళ ఒక స్వాంతన
కళ ఒక సాధన
కళ ఒక ఆరాధన
కళ ఒక ఆశ్వాధం
కళ ఒక వ్యక్తిగత ఆశక్తి
కళ ఒక వ్యక్తి వికాసం
కళ ఒక వ్యక్తి నైపుణ్యం
కళ ఒక వ్యక్తి సృజనాత్మకత
కళ నైపుణ్యం నాణేనికి ఇరువైపులు
కళ వృద్ధి కావాలంటే నైపుణ్యం అవసరం
నైపుణ్య ఉంటే ఏ కళ అయినా వృద్ధి చెందుతుంది
కళ ఉన్నదగ్గర నైపుణ్యం ఉంటుంది
కళ నైపుణ్యం అనేవి ఒక ఆత్మలో గల రెండు హృదయాలు
కళ నైపుణ్యం అనేవి ఓకే కొమ్మలో5 గల రెండు రెమ్మలు
కళ నైపుణ్యం అనేవి ఒక వ్యక్తికి రెండు కళ్ళు
కళ నైపుణ్యం అనేవి వ్యక్తికి ఒక అపురూప దైవానుగ్రహాలు
నైపుణ్యం లేకపోతే కళ అబ్బదు
కళ వున్నా నైపుణ్యం లేకపోతే వృద్ధి కాదు
కళా నైపుణ్యాలు పాలు నీళ్లు లా ఉంటాయి
అవి ఎన్నటికీ వేరుకావు
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు