రవ్వ పులిహోర --శ్రీమతి సత్య మొం డ్రేటి

రవ్వ పులిహోర --శ్రీమతి సత్య మొం డ్రేటి

కావలసినవి.

బియ్యపు రవ్వ..కప్పు ,

నీళ్లు.. ఒకటిముప్పావ్ కప్పు

శెనగ పప్పు.. 2 టేబుల్ స్పూన్

జీలకర్ర...అరటీ స్పూను

పచ్చిమిర్చి.... పది

ఎండు మిర్చి..రెండు.

కరివేపాకు... నాలుగు రె బ్బలు.

నూనె...రెండు టేబుల్ స్పూన్లు.

ఇంగువ...చిటికెడు

ఉ ప్పు...సరిపడా .. పసుపు కలిపిన మామిడి తురుము అర కప్పు.

తయారు చేసే విధానం.....

శెనగ పప్పు నీళ్ళల్లో వేసి నిమిషం సేపు నాన నివ్వాలి. నాన్ స్టిక్ పాన్ వేడి చేసి టీ స్పూను నూనె వేసి నీళ్ళు పోసి మరిగించాలి.అవి మరిగిన తర్వాత శెనగ పప్పు వేసి ఒక నిమిషం ఉడికించాక బియ్యపు రవ్వ వేసి మూత పెట్టి ఉడికించాలి.ఉడికిన తరువాత ‌ మూత తీసి పది నిముషాలు ఆర నివ్వాలి.మరో బాణలి లో నూనె వేసి ఆవాలు , జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి.తరవాత పచ్చి మిర్చి ఇంగువ, కరివేపాకు,వేసి వేగాక, ఉప్పు , పసుపు కలిపిన మామిడి తురుము వేసి వేయించాలి.దీన్ని ఉడికించిన రవ్వ మిశ్రమం లో కలపాలి.


0/Post a Comment/Comments