ఓహోహో గణపయ్యా* కైతికాలు -కాటేగారు పాండురంగ విఠల్

ఓహోహో గణపయ్యా* కైతికాలు -కాటేగారు పాండురంగ విఠల్


పత్రితో పూజలు చేసి
ఫలాలు నివేదన చేసి
భక్తితో పిజిస్తాము
మేము గుంజీలే తీసి
ఓహోహో గణాలయ్యా!
విఘ్నాలు బాపవయ్యా!

ఉండ్రాళ్ళూ కుడుములతో
చలివిడి నైవేద్యముతో
నిష్ఠగా పిజిస్తాము
భక్ష్య పరమాన్నాలతో
ఓహోహో గణపయ్యా!
సిద్ధి బుద్ధినివ్వవయ్యా!

ప్రతిపల్లె ఇంటిలోను
ఊరూ నగరాల్లోను
నవరాత్రులు పూజిస్తము
మహా నగరాలలోను
ఓహోహో గణపయ్యా!
మమ్ముల దీవించవయ్యా!

వరసిద్ధి వినాయకా
గణాలకధినాయకా
మూషికా వాహనా
పరమ ముక్తిదాయకా
ఓహోహో గణపయ్యా!
భక్తులను బ్రోవవయ్యా!

లడ్డూలనర్పిస్తాము
భక్తితో అర్చిస్తాము
పానకం వడపప్పులను
దేవా నివేదిస్తాము
ఓహోహో గణపయ్యా!
విజయము చేకూర్చవయ్యా!

శుక్లాంబర ధరుడవీవు
శశివర్ణ సుశోభితుడవు
చతుర్భుజములుగలవాడు
ప్రసన్నమైన వదనుడవు
ఓహోహో గణపయ్యా!
సంకటాలు తీర్చవయ్యా!

పెళ్లి పేరంటాలకు
నవ గృహప్రవేశముకు
గణపతిని అర్చిస్తారు
సకల శుభ కార్యాలకు
ఓహోహో గణపయ్యా!
ప్రథమ పూజితుడవయ్యా!

గీత నృత్య ప్రదర్శనలు
సమావేశ ఉత్సవాలు
నీ ప్రార్థనతో చేస్తరు
నవ్య శంకుస్థాపనలు
ఓహోహో గణపయ్యా!
సుఖసౌఖ్యాలివ్వవయ్యా

హిందూ సమాజాలలో
బౌద్ధ సాంప్రదాయములో
వినాయకుని కొలిచెదరు
జైన మతాచారములో
ఓహోహో గణపయ్యా!
సర్వమత పూజితుడవయ్యా!

దేశ ఐక్యతా చిహ్నము
సాంస్కృతిక వారసత్వము
హిందువులకు ముఖ్యమైంది
వినాయక చవితి పర్వము
ఓహోహో గణపయ్యా!
నిత్యం పూజిస్తామయ్యా!

*కాటేగారు పాండురంగ విఠల్*

0/Post a Comment/Comments