'అక్షరం..అక్షయం!'
పలువురికి పంచినా
తరగని నిధి..
నాడు రాతి పలకలు
నేడు అచ్చు యంత్రాల్లో
అక్షరాలు కూర్చినా..
విద్య అజ్ఞాన తిమిర సంహారంతో
వెలుగులు పంచే జ్ఞాన ప్రకాశే!
మానవ జీవన గమనాన్ని
సానుకూలం చేసే అక్షరం
ఓ పనిముట్టు..ఆయుధం..
ప్రగతి పథ సోపానం..
మనిషికి మాత్రమే లభించిన
అమూల్య ధనం..
అరుదైన వరం!
వినయ గుణ సంపదల గవాక్షం
'అక్షరం' అక్షయం!!
---సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.