కాళోజీ వందనం --సి. శేఖర్(సియస్సార్)

కాళోజీ వందనం --సి. శేఖర్(సియస్సార్)

కాళోజీ వందనం

ఎక్కడోపుట్టి ఇక్కడికొచ్చావు
పెరిగిన నేలలో "యాస"ను
నీ మనసంతా నింపుకున్నావు
తెలంగాణ భాషనంతా కలంలో నింపుకుని
నీ గళాన్ని గట్టిగా వినించావు
నిజాం నుండి నవాబుదాకా
దొరల దొరతనాన్ని సూటిగా
ప్రశ్నించావు 
జరిగిన జరుగుతున్న అన్యాయాన్నెదిరించావు
సామాన్యుడి బాధనంతా 
గళమెత్తిచాటావు
వివక్షనెదిరించావు
ఆకలి ఆర్తనాదాల మంటలను
అందిరిముందుంచి
జనం పక్షాన నిలబడ్డావు
తెలంగాణ సాకారానికి
ఆరని కాగడలనెలిగించావు
జీవితం విలవను తెలిపావు
క్షిపణిలాంటి మాటలతో 
సమాజాన్ని సవరించావు
కాలమేదైనా నీ కవనం
కొత్త సూర్యుడై ఉదయిస్తుంటది
బడి పలుకుల్లో
పలుకుబడులు పలకలన్నావు
దిక్కారానికి దిశ నిర్దేశం నీవయ్యావు
సదా వందనం కాళోజీ

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.


0/Post a Comment/Comments