యోగం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

యోగం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

యోగం..!(కవిత)

ఎన్ని రూపాయలు సంపాదించి లాభం లేదు..!
ఖర్చు పెట్టడానికి వెనుకాడినప్పుడు..!??
అనుభవించని సిరిసంపదలు వ్యర్థం..!
యోగం కూడ రాసిపెట్టి ఉండాలి..!

అనుభవించాలన్న కోరిక కూడ ఉండాలి..!??
ఎలాంటి ఆశలూ, కోరికలూ నెరవేర్చు కాకుండా పిసినారితనం చూపిస్తే..ఇంకెందుకు సంపాదన..!??
రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్లు..!??

ఎంతో మందిని చూస్తున్నాం..వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారో అర్థం కాదు..!??
ఒంటిపై బట్టలు సరిగా ఉండవు.,
చింపిరి గుడ్డలతో 
అగుపిస్తారు..!
ఏం ఖర్మ డబ్బులు లేవా అంటే..
ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి..!?
అంటే యోగం 
లేనట్లేననిపిస్తోంది..!??
ఇష్టమైనది కొనరు తినరు..!?

నుదిటి మీద రాసిపెట్టి ఉండాలనే విషయ వాస్తవాన్ని కాదనక పోవాల్సి వస్తోంది..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments