వలపు మాయ --దొడ్డపనని శ్రీ విద్య

వలపు మాయ --దొడ్డపనని శ్రీ విద్య

వలపు మాయ

గగనాన  మేఘూల మధనం
హృదయ సంద్రాన మనసుల విరహం
సముద్ర కెరటాల ఆలింగనం

తోడు ఇచ్చే ఆనంద పరవశం
ఎన్నో జన్మల అద్భుతం
వలపు మాయ స్థానం అనిర్విచనీయం
పంచుకోవాలి అనే మనసు ఆరాటం

ప్రపంచాన్ని మరిచి జీవించటం
బాధని మరిచి స్వాగతించటం
ప్రాణానికి ప్రాణమైన మనసు
దూరమైన, పోవును ప్రాణం

ఎదురుచూపుల ఆశనిపాతం
ప్రేమ తో ప్రేమిస్తు జీవితాంతం
బంధాలన్నీ మరిపించే అనుబంధం
మనసు మాట కోసం ప్రతి నిముషం

గడిపె క్షణమొక యుగం
మనసున చెరగని జ్ఞాపకం
ప్రపంచానికి తెలిసే తొలి పరిచయం
ప్రతి తలపూ ఓ హాయైన ప్రేమ గీతం

ఏడడుగుల బంధం కోసం నిలవడం
దూరమైన చూడలేను ఆ నరకం
చివరి క్షణం వరకూ నువ్వే నా బంగారం

ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా తనే నా ప్రపంచం
ఒకరి కోసం ఒకరం

ఒక్కరిగా మనం జీవితాంతం

దొడ్డపనని శ్రీ విద్య
విజయవాడ
25/09/2021
శనివారం

0/Post a Comment/Comments