మీరుచేసే పూజలకు
గణపతి ఆశీస్సులు
అందరికీ కలగాలి
ఫలించాలి ఆశలు
విజయం చేకూర్చాలి
వినాయకుడి పూజలు
విఘ్నేశ్వర అందుకో
ఘనమైన పూజలు
ఆరగించు గణపయ్య
కమ్మనైన వంటలు
తొలగించు ఆపదలు
రక్షించు పంటలు
సకాలంలో వానలు
తగినరీతిగ కురియాలి
అతివృష్టనావృష్టి
లేకుండా చేయాలి
రావయ్యా వినాయక
రైతన్నలకు మేలుచేయ
యావత్ప్రపంచాన్ని
ధర్మమార్గంలొ నడప
సంపూర్ణారోగ్యం
అందరిలో నిలప
రావయ్య గణపయ్య
మా పూజలందుకొనగ
వినాయక సంపూర్ణ
ఆశీస్సులు అందించ
అవసరాలు తీరేలా
అవకాశాలు కల్పించ
రావయ్యా గణపయ్య
మా పూజలందుకొనగ
గణపతిని అర్చించ
అరుదైన పుష్పాలు
అక్కర్లేదు సువర్ణ
కమలాలు కలువలు
ఆకులలములు చాలు
గడ్డిపరకలు మెచ్చు
భాద్రపద శుద్ధచవితి
గణేశుడి ఉత్సవము
వరసిద్ధి వినాయకుడికి
శతకోటి వందనము
రావయ్యా గణపయ్య
మాపూజలందుకొనగ
నవకాయ పిండివంట
నైవేద్యం కోరడు
నేతులూ తేనెలూ
గారెలు ఆశించడు
చప్పటి ఉండ్రాళ్లు మెచ్చు
సకలశుభాలనిచ్చు
మూల్లోకాలలో లేని
సౌందర్య లక్షణాలు
గణపతిలో ఉన్నాయి
శాంత స్వభావాలు
చల్లని చూపుకలవాడు
సకలశుభాలిచ్చువాడు
వివాహాది కార్యాలు
శుభ పూజలేవైన
ముందు పూజలునీకే
ఏ దైవ పూజలనైన
ఆదిదేవ గణపతి
అందుకో మా పబ్బతి
ఆకులలములు చాలు
గడ్డిపరకలను మెచ్చు
భక్తితో ఆరాధిస్తే
సకలశుభాలనిచ్చు
విఘ్నాలు తొలగించు
ఆదిదేవుడతడు
తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.