బాల గేయం
పల్లవి:
వందనాలు వందనాలు
చదువుల హరి చందనాలు..
గురువులకు ప్రణామాలు....
చరణం:
పలక పట్టి బలపం పెట్టి
దిద్ది ఇస్తారు ఆ ఆ ఇ ఈ లు
బ్రతుకులో మాకు అక్షర దీపాలు
జ్ఞాన జ్ఞాన సరస్వతి అమ్మ దీవెనలు
గురుదేవుల ఆశీర్వాదాలు
చరణం:
అక్షరాలు నేర్చుకుని
జ్ఞానాన్ని పెంచుకుని
క్షరం కానిది అక్షరం
అది యే మనకు జీవనం
దేశానికి పురోగమనం
చరణం:
పిల్లలం జాతి దివ్వెలం
భరత జాతి వెలుగు కాగడాలం
తల్లిదండ్రుల జన్మ ఫలాలం
వందేమాతర నినా దలం
చరణం:
వందనాలు వందనాలు
చదువుల హరి చందనాలు
గురువుల శ్రమ ఫలితాలం
దేశ ప్రగతి చిహ్నానలం
పేరు శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1