పరమ పావని అవని ...బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి

పరమ పావని అవని ...బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి

పరమ పావని మా అవని

అవని అవని అవని
పరమ పవిత్ర పావని
పావని పావని పావని
ప్రకృతి శక్తుల సంజీవని !

అవని అవని అవని అవని
పరమ పవిత్ర మా పావని
గోడును వినుకొను శ్రావణి
తోడుగా నిలిచే మాతరుణి !

పావని పావని పావని
పరమ పవిత్ర మాఅవని
కరుణించే మా వీణాపాణి
సిరిసంపదల మా శ్రీవాణి !

అవని అవని అవని అవని
పరమ పవిత్ర మా పావని
సద్బుద్ధిని ఇచ్చే సాధ్విమణి
అభివృద్ధిని మెచ్చేమారమణి !

పావని పావని పావని
పరమ పవిత్ర మా అవని
అద్భుత శక్తుల మేముకని
ప్రార్థిస్తున్నాం శుభ కారిణి 

అవని అవని అవని అవని
పరమ పవిత్ర మా పావని
ప్రజ్ఞా పాఠవ మా నటీమణి
విజ్ఞాన వికాస విదూశమణి!

పావని పావని పావని పావని
పరమ పవిత్రమైన మా అవని
మాజన శారీరక జ్వరమానిని
మన ఆరోగ్యప్రద స్థిర ధమని !

పావని పావని పావని పావని
పరమ పవిత్రమైన మా అవని
జనహితమే తన ధ్యేయమని
ముగించే గా తన అధ్యాయాన్ని !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments