విరబూసిన మన బడులు ---రచన: వడ్ల నర్సింహా చారి, వికారాబాద్.

విరబూసిన మన బడులు ---రచన: వడ్ల నర్సింహా చారి, వికారాబాద్.

విరబూసిన మన బడులు
---రచన: వడ్ల నర్సింహా చారి, వికారాబాద్.

మణిపూసలు
***********

కలువ పూల రెమ్మలా
మరుమల్లెల కొమ్మలా
విరబూసెను బడులన్నీ
బాపు గీయు బొమ్మలా!!

బడి పిల్లల కేరింతలు
నగుమోమున తుళ్ళింతలు
కానవచ్చె బడిన నేడు
ప్రారంభపుపులకింతలు!!

ప్రపంచాన కరోనా
కాటువేయు క్షణానా    
మూతబడెనుబడులన్ని 
కఠినమైనదినానా!!

కుంటుబడెను చదువులన్ని
దారి తప్పెను బడులన్ని
కరోన విషరక్కసితో
క్షీణించెను బ్రతుకులన్ని!!

పాఠశాల నడవాలి
పిల్లలంత రావాలి
చదువులమ్మ దీవెనతో
జ్ఞాన సిరులు కురవాలి!!

దేవుడా మముకరుణించు
జీవ,జనుల నాదరించు 
మోములపైచిరునగవులు
చెరగవనియూదీవించు!!

...మణికర్ణిక
వడ్ల నర్సింహా చారి
వికారాబాద్
చరవాణి:8500296119 


0/Post a Comment/Comments