స్వాగతం గణాధిపా - సుస్వాగతం గణాధిపా --వి.టి.ఆర్.మోహనరావు

స్వాగతం గణాధిపా - సుస్వాగతం గణాధిపా --వి.టి.ఆర్.మోహనరావు


చేసెను నలుగుపిండితో
ఉమనిను ఇష్టముగ
తనను అడ్డగించితివని
భవుడు నీతల త్రుంచగ
ఆహా! జ్ఞానము మాకిచ్చుటకు
కరిముఖమును ధరించినావా

భాద్రపద చవితినాడు
నీవు పుట్టితివంట
ఆ ఘన వేడుకలును
జరుప మాకనందమంట
విఘ్నరాజా గణాధిపా
మావిఘ్నములు తొలగించరావా

సకల విద్యాధిపా
షణ్ముఖుడు నీ సోదరుడు
పార్వతి నీకు తల్లి
లయకారుడే నీ జనకుడు
ఆహా! శుభకార్యమేదైనా
తొలిపూజ నీదేకద విఘ్నేశ్వరా

సకల విఘ్ననాశకా
సమస్త విద్యాధిపా
మా సద్భుద్ధికారకా
కరిముఖరూపా
వహ్వా! మా వరసిద్ది ప్రధాతవు
క్కుఆaక్ సుస్వాగతం గణాధిపా

మృత్తికారూపుడవు
జ్ఞాన స్వరూపుడవు
భక్తులకు సులభుడవు
సకలగణ నాయకుడవు
ఆహా! సకలాభీష్ట కారకా
నీకు స్వాగతం సుస్వాగతం

--వి.టి.ఆర్.మోహనరావు,
పాల్వంచ,10-09-2021.

0/Post a Comment/Comments