మానభంగానికి ఉరి శిక్ష ఖరారు చేయండి
మగాడు మృగమవుతున్నాడు
కళ్ళకు కామపు పొరలు కప్పి
చిన్న పెద్దా తేడా లేదు
వావీ వరుసా అసలే లేదు
మనిషి మృగమవుతున్నాడు
కన్న తల్లిదండ్రులే బిడ్డలపై
లైంగిక దాడికి తెగబడుతుంటే
కన్నవాళ్లేకామాంధులవుతుంటే
దైవమా ఆడవారికి రక్షకు లేవ్వరు ?
మగాళ్ళు మృగాళ్ళయి
ఉన్మాదులుగా మారి
లైంగిక దాడులకు తెగబడు తుంటే
పసి మొగ్గలను కిరాతకంగా
చిదిమేస్తుంటే
ఆంబోతులా విచ్చలవిడిగా
తిరిగే ఈ మానవ మృగాలను
పట్టి బంధించే కంటే
మానభంగం చేసిన వారికి
ఉరిశిక్ష వెయ్యాలి.
చట్టాలు మార్చేయండి
ఉరిశిక్ష ఖరారు చేయండి
ఉరిశిక్ష శాసనం చేయండి
అప్పుడే ఈ కిరాతకాలకు
తెరపడుతుంది.
నిర్భయ ,దిశ,చట్టాలు చెదలు పట్టి పోతున్నాయి
ఇలాంటి కేసుల్లో
ప్రత్యేక కోర్టులు వెయ్యండి
పరిష్కారం తొందరగా చేయండి
సంవత్సరాల పొడుగు సాగదీయకండి
మానం పోతుంది ప్రాణం పోతుంది
తీర్పులు మాత్రం
వత్సరాలు దాటి పోతున్నాయి
మళ్లీ ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి
ప్రత్యేక కోర్టులు వేసి
పరిష్కారం తొందరగా చేస్తే
సమాజం న్యాయవ్యవస్థకు
జేజేలు పలికి
పట్టం కడుతుంది.
*'రసస్రవంతి ' 7075505464*
*' కావ్యసుధ ' 9247313488*