వినాయక చవితి శుభాకాంక్షలతో... -ఆటవెలది పద్యాలు🌟వడ్ల నర్సింహా చారి

వినాయక చవితి శుభాకాంక్షలతో... -ఆటవెలది పద్యాలు🌟వడ్ల నర్సింహా చారి

🌾🌻🌹🌻🌹🌻🌹🌻🌾
*🥀🌷వినాయక చవితి శుభాకాంక్షలతో....🌷🌾*
      🌟ఆటవెలది పద్యాలు🌟
వడ్ల.నర్సింహా చారి, జడ్పీ హెచ్ యస్. శేరిలింగంపల్లి
@@@@@@@@@@@@@

ఆదిదేవ మిమ్ము నార్తితో కొలిచెదా
అభయమిచ్చి మమ్ము నాదు కొనుము
పర్వదినపు శోభ పరిఢవిల్లుచునుండె
మంట,మంటపాన మరులుగొల్పి!!

తల్లి పార్వతమ్మ తనయుడివైనీవు
తరలిరాగజూచి ధరణి జనులు
తన్మయత్వమంది తగినపూజలుజేయ
తరలినారు చూడు తన్మ యాన!!

సర్వ పూజ్య మిమ్ము సరసంగ సేవింతు
నిండు మనము నందు నిన్ను నిల్పి
మమ్ము గావగాను మాయింటి కరుదెంచి
మాదు పూజలంది మమ్ము బ్రోవు!!

ఏకదంత మిమ్ము ఏరీతి పూజింతు
నీదు కరుణ పొంది నిన్నుచేర
పులకరించె మేను పూజించగనుమిమ్ము
వచ్చినిల్చినట్లు భ్రాంతికల్గి!!

సర్వకార్య విజయ సంపన్న మిమువేడ
దుఃఖబాధలన్ని దూర మౌను
పిండివంటలన్ని ప్రీతితో నర్పింతు
ఆరగింపుమయ్య నాదిదేవ!!

విఘ్నరాజ మిమ్ము వినుతించనెంచగా
కలముకదిలెనయ్య కాంతితోడ
పదము,పదముకూర్చ పాదమైరూపొంది
"ఆటవెలది"గాను నవతరించె!!
*......✍️మణికర్ణిక🌹☘️*
🌻🌷🌾🥀🙏🙏🥀🌾🌷🌻 

0/Post a Comment/Comments