ఓ ప్రియసఖి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

ఓ ప్రియసఖి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక:ఓ ప్రియసఖి

నిను నేను చేరువవ్వలేను
నిను చేరువ చేయలేను
నిను ఎవరికి చేరువ చేయలేను
నువు ఎవరికి చేరువైనా ఉండలేను

నీ నిలకడ లేని తనానికి
నీకు నిశ్చలత్వం లేనితనానికి
నీ చపలత్వానికి
నీ సంకుచితత్వానికి

నువుకోరుతున్నావు
నువు కోరుకున్నావు
నువు కోరుకుంటున్నావు
నువు కుదుటగా వుండకున్నావు

నీ హృది మది గది కాదు పదిలం
నీ హృది మది సవ్వడి కాదు మృదులంనీ హృది మది కాదు నేనే సకలం
నీ హృది మది యే కదా నా కలకలం

నిను కోరుకుంటున్నా
నువు నను కోరుకుంటున్న
ఒకరిని ఒకరు కోరుకుంటున్న
ఒకరికి ఒకరు దగ్గరగా ఉండి దూరమవుతున్న

మనుషులు దగ్గరలో వున్నా
మనసులు దగ్గరలో వున్నా
మమతల దగ్గరలో వున్నా
ఒకరికి ఒకరు కలవలేకపోతున్నా

ఎవరిది తప్పు 
ఎవరిది ఒప్పు
ఎవరికి ఎవరు
ఎవరు ఎవరికి

రాసేవాడున్నాడు
రాసేసేవున్నాడు
రాజేస్తున్నాడు
రాజీ చేయలేకున్నాడు

తప్పదు రాజీ
జీవితం కాదు ఈజీ
జరిగేవన్ని మాజీ
జరగబోతున్నదే తాజీ(తాజా)

మార్చుకో
నిను నువ్వు మార్చుకో
నీ తీరు మార్చుకో
అదే మనల్ని కలుపుతుంది


రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments