తెలంగాణ భాష కాత్మ (కైతికాలు) --రమేశ్ గోస్కుల, కైతికాల రూపకర్త.

తెలంగాణ భాష కాత్మ (కైతికాలు) --రమేశ్ గోస్కుల, కైతికాల రూపకర్త.


కాళన్న నీ కవితలో
కమనీయం మన భాస
నిచ్చెనై వెలిగించిన
సత్తు నిండిన శ్వాస
గొర్రె దాటు జన విశ్వాసానికి
ఘోరికట్టిన గొప్ప చరితం

పేద ప్రజ వెలుగు నీవు
కారు చీకటి కదిలించి
యాస కోనకు శ్వాసైన
కొత్త గీతం రచియించి
జయహో కాళన్నా
తెలంగాణ కు ఉనికి వన్నా

గెలుపు ఓటమి లనెన్నో
మనసు నిండా గాంచావు
ధైర్యం తో దండు గట్టె
పోరు మంత్రమేసినావు
మోసగాళ్ళు ఏడున్నా
ఈడ్చి పాతరేయన్నవు

తెలుగు ను మరచినోని
బ్రతుకె వ్యర్థ మన్నావు
భాష భక్తిన నిలిచి 
బహు దూరం సాగినావు
ప్రత్యేక తెలంగాణ 
కలన మమ్మ ముంచినావు

తాకనట్టి శిలలు లేవు
చూడని చీకట్లు లేవు
పాలకుల దుమ్ము దులిపి
బడుగులకు ధైర్యమైనవు
ఆధునిక తెలంగాణ కు
దీపమైన ధీర కవివర్యా!

నిప్పు కణికల నంటించె
నీదు కైత భావ ఝరులు
తరాలకు భవిత గీతలు
భవ్యమగు నీదు గొడవలు
వారేవ్వా కాళన్నా
తెలంగాణ భాషకాత్మవు.


రమేశ్ గోస్కుల,
కైతికాల రూపకర్త.


0/Post a Comment/Comments