ఓజోన్ - పరిరక్షణ
రక్షణ కవచమే లక్ష్మణ రేఖ
సకల జీవరాశికి రక్షణ కవచం
అతి నీల లోహిత కారణం
మానవ ఆరోగ్యం అతి దారుణం
ఆమ్లజని వాయు మరో రూపం
మనిషి ఆర్యోగ్యం పై తీవ్ర ప్రభావం
ఎన్నో జీవ రాశులకు ప్రాణ సంకటం
ఓజోన్ పొరను కాపాడుకుందాం
పరిరక్షణకు మానవ ప్రయత్నం చేద్దాం
వాయు కాలుష్యాన్ని తగ్గిద్దాం
హరిత వనాలను పెంచి పోషించుకుందాం
ప్రకృతి సంపదను కాపాడటం లో ముందడుగు వేద్దాం
పర్యావరణానికి హని కలిగించే వినియోగం తగ్గిద్దాం
ప్రజలలో చైతన్యాన్ని నింపుదాం
నియంత్రణా చర్యలు చేపడదాం
మానవాళి ఆరోగ్యాన్ని పరి రక్షించుకుందాం
మనిషి స్వార్థమే ప్రకృతి ఇచ్చే పెను ప్రమాదం
వాహన , ఇంధన పరిశ్రమల కాలుష్యం
సకల జీవ కోటి బ్రతుకు ప్రశ్నార్ధకం
మానవ జీవనం కడు అయోమయం
ముంచుకు వచ్చే ప్రమాదాన్ని గ్రహిద్దాం
విలాసాలను తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం
మన మానవ జీవన విధానాన్ని మనమే మార్చుకుందాం
భవిష్యత్తు తరాన్ని భయానకం నుండి కాపాడదాం
మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం
దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
9492 85 8442
16/09/2021
గురువారం