మంచి ఎక్కడ..!?(కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మంచి ఎక్కడ..!?(కవిత) --ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మంచి ఎక్కడ..!??(కవిత)

మంచికి కాలం చెల్లిందని అంటున్నారు..!
కలికాలంలో అన్నీ విచిత్రాలు అంటున్నారు..!

మోసం, 
దొంగతనం ,హత్యలు,
మానభంగాలు ..
మామూలు అయిపోయాయి అంటున్నారు..!
స్త్రీకి విలువ లేనట్లు అమానుష చర్యలు ఏంటని వాపోతున్నారు..!
అస్సలు రక్షణ లేకుండా పోతుందంటున్నారు..!
ఎక్కడ చూసినా..
అరాజకం,
అవినీతి పర్వం,
లంచం లేనిదే కంచం 
లేదన్నట్లు సిగ్గుమాలిన బ్రతుకు బ్రతుకుతున్నారు..!
కేవలం పేరుకే మహానుభావులు..
మోతుబరులు..ఒక్కటంటే ఒక్క సాయం కూడ చేయని గుణమున్నవారు..!
కిందపడిన వాణ్ణి,లేపడం కాదు కదా..
తన్నుకుంటూ పోయే పరమ దరిద్రులున్న కాలం..ఇది..!!
యాడనో..నూటికో కోటికో మంచోడు..!
ప్రతి చోట మోసగాడు..!
తిష్ఠ వేసి ఉన్నాడు..!??

--విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments