నరేంద్రుడు మన రాజేంద్రుడు -పసుమర్తి నాగేశ్వరరావు

నరేంద్రుడు మన రాజేంద్రుడు -పసుమర్తి నాగేశ్వరరావు

నరేంద్రుడు మన రాజేంద్రుడు

దామోదర్ దాస్ హీరబెన్ ల తనయుడు
సంపూర్ణ RSS సేవకుడు
గుజరాత్ రాష్ట్ర పౌరుడు
ప్రస్తుత మన భారత దేశ ప్రజనాయకుడు

ప్రస్తుతం భారత్ గుండె చప్పుడు
శత్రుదేశాల గుండెల్లో చేసే చప్పుడు
అభివృద్ధి కి వేసే అడుగుల చప్పుడు
యువతరానికి చేయూత చప్పుడు

నవభారతం లో నవ్యాత్మక భావన చతురుడు
గుజరాత్ రాష్ట్ర ప్రజాభీష్ట అభ్యున్నతి  సాధకుడు
భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచపు కీర్తి కిరీటం లో ఉంచిన పాలకుడు
భరతమాత గర్వించే యోగ్యత గల దేశగానాయకుడు

4సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి గా
2సార్లు భారతదేశ ప్రధానమంత్రి గా
అపర చాణుక్యునికన్న మిన్నగా
భారతదేశ భవితవ్యానికి బంగారు బాట వేసిన ప్రజా పాలకుడు

ఇంతింతై వటుడింతైనట్లు గా ఎదిగి
ఎదిగే కొద్దీ నిగర్విగా నిరాడంబరుడు గా ఒదిగి
కించిత్ స్వార్ధం గాని స్వలాభం గాని చూడకుండ
నిరంతర ప్రజాసేవయే లక్ష్యం గల సలక్ష్యమైన ప్రధాని

అశేష జనం విశేషం గా అభిమానించే ప్రజా రంజక పాలకుడు
సామాన్యుని గా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన ప్రతిభావంతుడు
వాదన కన్నా సాధన మిన్నయని భావించే మహోన్నతుడు
140 కోట్ల భారతీయుల కలల సార్ధకుడు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
         టీచర్ సాలూరు
          విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments