గురువును మార్చిన రోజులు
గురువును, తమ ఉన్నతిని కోరే పరువుగా పూజించే రోజులు పోయాయి!
గురువును, భూమి మీద పనికిరాని బరువుగా భావించే రోజులు వచ్చాయి!!
గురువును, విద్య నేర్పి ఉజ్వల భవిత ఫలాలిచ్చే తరువుగా తలంచే రోజులు పోయాయి!
గురువును, ఉద్యానవనంలో కలుపు మొక్కలా చూసే రోజులు వచ్చాయి!!
గురువును, చదువుల రాజ్యానికి రాజును చేసిన రోజులు పోయాయి!
గురువును, పదవులు పొందడానికి పావులా వాడుకునే రోజులు వచ్చాయి!!
గురువును, తమ జీవితానికి దారి చూపిన హీరోలా అభిమానించే రోజులు పోయాయి!
గురువును, కామిక్ సీరియల్స్ లో జోకర్ లా మార్చిన రోజులు వచ్చాయి!!
గురువును, కనిపించే దేవుడిగా పూజించి ఆయన చెంత చేరి చదువులు నేర్చుకున్న రోజులు పోయాయి!
గురువును, పనిమనిషిగా తమ కాళ్ళ దగ్గరకు రప్పించి అవమానించే రోజులు వచ్చాయి!!
గురువుకు, త్రిమూర్తులతో పాటు సమున్నత స్ధానాన్ని కట్టబెట్టిన రోజులు పోయాయి!
గురువుకు, బ్రహ్మ రాక్షసుల సమూహంలో చోటును కల్పించిన రోజులు వచ్చాయి!!
గురువుకు, సాష్టాంగ నమస్కారం చేసి సంస్కరించే రోజులు పోయాయి!
గురువుకు, పంగ నామాలు పెట్టి మస్కా కొట్టే రోజులు వచ్చాయి!!
ఇది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం. ఇప్పుడిదే గురువుకి దక్కుతున్న సత్కారం. ఈ రోజుల్లో ఒక గురువుగా నేనున్నందుకు బాధపడుతూ రాసిన కవిత.
---- కొత్తపల్లి రవి కుమార్
రాజమహేంద్రవరం
9491804844