ముత్యాల హారాలు -- శ్రీమతి సత్య మొం డ్రేటి

ముత్యాల హారాలు -- శ్రీమతి సత్య మొం డ్రేటి

ముత్యాల హారాలు1  స్వాతి వాన కు ముత్యము
        సాగరంలో మత్యము
         అనారోగ్యం పైత్యము
          కావాలి ఐకమత్యం

2.   సప్తవర్ణాల హరివిల్లు
      అష్ట వర్ణాల విరి జల్లు
   ‌‌    నవమి నాటి వానజల్లు
       దశమువ్వల ఘల్లు ఘల్లు.


3 . తోబుట్టువుల ప్రేమ కు
     సాటి లేదు మన జన్మకు
     తల్లికి పుట్టిన బిడ్డలకు
     రక్త బంధమే మనుషులకు

4 .ఆచరణలో రావాలి
    అభ్యుదయం కావాలి
    అపోహలు పోవాలి
     అంతా కలిసి ఉండాలి

    5  రావాలి అంబేద్కర్
        కావాలి మార్గదర్శకర్
        దేశానికి తేజాకర్
        జాతికి అమృతా కర్

6. దేశంలో లేని ప్రజ
    మకుటం లేని రాజ
    జనాలకు లేదు అజ
     రుచికరమైన కాజ


7.   నీతి నిజాయితీలు
       మంచి వారిసుగుణాలు
       మనుగడకు మార్గదర్శి లు
        జాతికి మణిపూసలు.


  8.   మనోవ్యధ కు మందు
       చావు పుట్టుక కి ముగింపు
        ఆకలి దప్పిక లందు 
        ఉండదు లేసవరింపు.

9  మంచి ముత్యాల ముచ్చట్లు
   మెడలోన హారాల అచ్చట్లు
    బ్రతుకు బాధల అగచాట్లు
    తెలుగు వారి పెసరట్లు 


   10   దేశానికి రైతు రాజు
      లేదు తిండి ఏ రోజు
      నాగరీకులకు పోజు
       దులపాలి వారి బూజు


11. సుందర వసంత మాసము
       ఆహ్లాదకర ప్రకృతిగీతము
        కోకిలమ్మ కుహు గానము
       ‌‌ అందాల చైత్రమాసము.

 
 12.రామాయణ కవి వాల్మీకి
     భవిష్యత్ రామాయణానికి
    ఊహించి రాసిన మహాకవి కి
   వందనాలు  దివ్య దృష్టికి.

13.శ్రీరాముడు అందగాడు
      నీలమేఘశ్యాముడు
       పితృవాక్య పరిపాలకుడు
      సదాఏకపత్నీవ్రతుడు


14.జనకుని కూతురు సీత
      సాధ్వీ మా అవని జాత
      వనవాస ఓర్పు మాత
       అసాధారణ ప్రతివ్రత


15. యుగాలు తరాలు మారిన
 మారలేదు  ప్రజల మదిన
సీతారాముడు కొలువైన
గుడిలో ప్రతి గ్రామమున

16. దశరథ కుమారుడు
      సూర్య వంశ వారసుడు
      అయోధ్య పరిపాలకుడు
        సీతారామచంద్రుడు


17.రామరూపము మోహనము
     విజయమే రమబాణము                              
  గొప్పదైన రామ పాదము
  పాపాలు పరిహారము
   

18.శుభఉగాది పండుగ
 ‌‌ ఆనందం నిండుగ
 కోకిలమ్మ తీయగాపాడగ
 వేప పూలు విరియగ

19.అయోధ్య రామాలయం
       అందరి దేవాలయం
       ‌ సీత రామకళ్యాణం
        చూసి వద్దాం రారండి.

20 మంచిముత్యాల హారము
  ముదితలకు సోయగము
  సుందర దరహాసము
   ఆరోగ్యానికి మూలము

21.మనసులోని గాయాలు
     మధురమైన గేయాలు
     స్పందించిన భావాలు
     నా మది అనుభవాలు
22.పుస్తకమే ప్రపంచము
      పుస్తకమే నా నేస్తము
       పుస్తకమే మా విజ్ఞానము
        పుస్తకమే నాకుమార్గము

 23. దేశకల్లోల పరిస్థితి 
      ప్రజల అయోమయ స్థితి
      అంధకార  భయభీతి
       ధైర్య సాహసాలు రీతి.24.
కరోనా కల్లోల స్థితి
ప్రజలకు లేదు శాంతి
మనఆరోగ్య పరిస్థితి
ఆశ యే మనకు కాంతి.

 25. అల్లుడు గారి అలక
      అత్త మామలకు చురక
       ఏం చేయాలో తెలియక
      నవ్వుకున్నారు పకపక.


26 భయాందోళనలు వద్దు
    మనోధైర్యమేముద్దు
   పెళ్లి పేరంటం రద్దు
   నిత్యావసరాలు సిద్దు
 
 
 27. పరాయి దేశపాపము
   అంత అంటించుకున్నాము
   నివారణోపాయము
    జాగ్రత్త పాటించాము..29.రావాలి మంచి రోజు
      దులపాలి కరోన బూజు
      ఆరోగ్యమే   మోజు
      అది అందరికీ రివాజు..    

30  చెడు మాటలు విషమే
       సుగుణాలు అమృతమే
    ‌    అపనిందలు ఘోరమే
        వింటుంటే పాపమే.

31. అంత మహానుభావులే
       దొరికితే  దొంగలే
       దొరకకపోతే దొరలే
       చెప్పేవి సుభాషితాలే.
 
32.కరోనా కల్లోల స్థితి
     ప్రజలకు లేదు శాంతి
     మనఆరోగ్య పరిస్థితి
     ఆశ యే మనకు కాంతి.

33. అల్లుడు గారి అలక
      అత్త మామలకు చురక
       ఏం చేయాలో తెలియక
      నవ్వుకున్నారు పకపక.


34. రావాలి మంచి రోజు
      దులపాలి కరోన బూజు
      ఆరోగ్యమే   మోజు
      అది అందరికీ రివాజు.

35.. చెడు మాటలు విషమే
       సుగుణాలు అమృతమే
    ‌    అపనిందలు ఘోరమే
        వింటుంటే పాపమే.

36.అంత మహానుభావులే
       దొరికితే  దొంగలే
       దొరకకపోతే దొరలే
       చెప్పేవి సుభాషితాలే.

37.ముత్యాల హారం
     అభ్యుదయ కవి శ్రీశ్రీ
    మహాప్రస్థాన శ్రీశ్రీ
   ప్రజాశక్తి శ్రీ శ్రీ
    విప్లవ భావకవి శ్రీశ్రీ.

38. ముసురుకున్న చీకట్లు
     తెల వారితే ముచ్చట్లు
    పని పాటల ఇక్కట్లు
    బ్రతుకు లో అగచాట్లు.

 39.మే డే కార్మికుల దినము
       శ్రమ జీవన సౌందర్యము
       అలసటలేనిజీవితము
       అందరికీ ఆరాధ్య ము

40.మే డే కార్మికుల రోజు
       వస్తుంది ఏదో ఒక రోజు
       చేసుకోవడం రివాజు
      ఇవ్వాలి పూల వాజు.

41.ఆత్రేయ  గీతాలు 
       శతజయంతి ఉత్సవాలు
        ఆనంద పరవశాలు
        గీతా అభిమానులు.


42.. మనసులోని భావాలు
వాడుక భాషలో ప్రజలు
అర్థమయ్యే పదాలు
మనసు కవి గీతాలు

43.ఆత్రేయ గేయాలు
ప్రేమికుల గాయాలు
మనసుకి అనుబంధాలు
ఆత్రేయకు వందనాలు
44. సాహిత్యాని కే కవి
     సంగీతాని కే భావి
    పొలాలకు పంట విరివి
అనురాగము నకు అలవి.

45. విశ్వకవి రవీంద్రుడు
       జనగణమన వీరుడు
      గీతాంజలి సూర్యుడు
     నోబెల్ సాధకుడు.

 46వంగ దేశాన పుట్టాడు
       ఇంటిలోనే చదివాడు
      ప్రపంచాన్ని చూశాడు
      మహా గ్రంథాలు రాశాడు. 

47ఆచార్య ఆత్రేయ
       గేయాలకు మైత్రేయ
      చలనచిత్ర పరకాయ
       వందనము కవి రాయ.

48 జన్మనిచ్చింది అమ్మ
      జీవితానికి పట్టుకొమ్మ
     నా ఆటకు ఆమె బొమ్మ
    నా పాపకు తను అమ్మమ్మ.

49.. అమ్మే మనకు దేవత 
       వెలకట్టలేని మమత
       నీకు  వెలుగునిచ్చే నెలత
       మది మెచ్చే సహృదయత

50. సృష్టికి మూలం అమ్మ
అమ్మ ఒడిలో నేను బొమ్మ
నాకు అమ్మ ముద్దుల గుమ్మ
వంశవృక్షానికి పసిడి కొమ్మ


51.జయహో మాతృమూర్తి
        దశదిశలా నీ కీర్తి
         త్యాగానికి నీవు ఆర్తి
          మా అందరికీ స్ఫూర్తి
   ‌‌                   
52.ఎన్నెన్నో వర్ణాలమాల
సప్తస్వర రాగహేల
ప్రకృతి అందాల జోల
పడతిచక్కని బేల.

53.. మురిపించే మువ్వలు
       ఆడుకునే గవ్వలు
       పూజ చేసే పువ్వులు
       కాపాడే దైవాలు.

54.. పిలిచితే పలుకుతావట
       ఆపదమొక్కుల వాడివట
        ఏడుకొండలు ఎక్కాల ట
        పాడాలి నీ పాట.

55. శ్రీదేవి భూదేవి నీ వాళ్ళు
      సకల జనులు నీ వాళ్ళు
       నిన్ను చూస్తాయిమా కళ్ళు
        నీ ఆరాధన మా కళ్ళు.

56 అందమైన పల్లెటూరు
      ఆప్యాయత పుట్టినూరు
      ఆదరణ కు మరో పేరు
      మమతల మారుపేరు

57.కవి కి సాహిత్య పిపాస
     రవికి ప్రకాశ ఉషస
      శిల్పి కి శిల్ప విలాస
       చిత్రకారుడి యాస

58. శిల్ప కళా నైపుణ్యము
      చరిత్రకి తార్కాణము
       సప్తస్వర సంగీతము
       సంప్రదాయ నవ గీతము

59. మధుర మహానుభావులు
       అందరికివందనాలు
   ‌    సాహిత్య పిపాస కులు
        స్వరవాగ్గేయకారులు

60 రంజాన్ ముస్లిం పండుగ
       ఇస్లాం నెలలో మెండుగ
 ‌‌       ఉపవాసాల పండుగ
     ‌‌  నెలవంక చూసేరుగ

61.సూర్యోదయం నుండి 
       నీరు తాగకుండా ఉండి
       ఉపవాస దీక్ష మడి
       ‌ సూర్యాస్తమయ వెంబడి

62.నమాజు ప్రార్ధనలు
      కఠోర దీక్షతో రివాజు లు
      దానధర్మాలు ‌ విందులు
      రంజాన్  సంబరాలు.
 63.సింహాచల క్షేత్రంలో
      చంద న మహోత్సవము
       అప్పన్న స్వామి గుడిలో
        అంగ రంగ వైభోగము.

 64..అక్షయ తృతీయ తిథి న
     మొదలు పెట్టిన కార్యము
     క్షయము ‌కానిది జయమున
      కాగలదు సంపూర్ణము.

 65.చిన్నకుటుంబము చింత
     లేని కుటుంబం  భద్రత
     కు  మరో పేరు అని కొంత
     బాగుంటుంది భవిత.

66.ఉమ్మడి కుటుంబమే
  మమతా మాధుర్యామే
   బాధ్యతసమ్మేళనమే
   సమిస్టి కుటుంబమే

67..దేశానికి అభి వృద్ధి
రహదారి కి బహు రద్ది
ఆశీర్వావచనసిద్ది
అందరికి ఉంది బుద్ది.

 68 కుటుంబానికి పెద్ద
    పైన  ఎగురుతున్నగద్ద
       రంగవల్లులసుద్ద
      తాలింపు  శెనగ బద్ద.

 69. గౌతమ బుద్ధుని పుట్టినరోజు
జగాని కి పండుగ రోజు
తొలగిన అజ్ఞానపు బూజు
అనుసరించుట రివాజు.

70. భారతంలో పుట్టిన 
      బౌద్ధమతం మెట్టిన
      దేశాలు మరి ఎన్నైన
      విజ్ఞానానికి ఉప్పెన.
 

71.శుద్ధ వైశాఖ పూర్ణిమ
పాల వెన్నెల మహిమ
తథాగతుని జనన ప్రేమ
లుంబిని సార్ధక నామ.

72. బుద్ధం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి 
గౌతమ బుద్ధుని కలిమి
అజ్ఞానం అందరి లేమి

73. వైశాఖ ఏకాదశి
  గగనాన వెలిగే శశి
  భువిన అంధకార నిశి
   విశ్వేశ్వరుడు న్నకాశి

 74.మనసుకు కూడదు అశాంతి
     సదా కావాలి శాంతి
     దేశ ప్రజలకు ప్రశాంతి
     జన జీవనానికి  కాంతి.

75. గౌతముని పుట్టినరోజు
జగాని కి పండుగ రోజు
తొలగిన అజ్ఞానపు బూజు
అనుసరించుట రివాజు.

76.. సంపద ఉన్నా తృప్తి
      లేక లేదు సంతృప్తి
     ‌ భక్తి లేక లేదు దీప్తి
       మనసుకు లేదు జ్ఞప్తి

77. అతివ అందమైన శక్తి
       పూజకు కావాలి భక్తి
       రసజ్ఞుల కు చెందిన రక్తి
       భక్తితో వస్తుంది ముక్తి .

78. గోపిగోవర్ధనగిరి
     గలగలల  గోదావరి
   ‌   పంట చేలల్లో వరి
     ‌‌  ధాన్యం  నిన్ను కోరి.

 79.రసమయ రంగులజగతి
    కళల లోభారత జాతి
    అది మన‌జాతి‌ప్రగతి
    మన దేశ ప్రజల ఉన్నతి

80.అన్నదమ్ముల బంధం
అవని కే ఆనందం
అనిర్వచనీయ మోదం
కుటుంబానికి అందం.

81.చరిత్రలో వాసికెక్కి
శిల్పాలు ఎన్నోన్నో చెక్కి
ఫలహారాలన్ని మెక్కి 
వ్యవహారాలుకొండెక్కి.

82.. ప్రేమించేది ప్రేయసి
     బొమ్మల కథలో రాక్షసి
     ‌ అందముంటే రూపసి
      జిజ్ఞాస కవి పిపాసి

83రసరమ్య రాగసుధ
      వంశి ప్రేయసి రాధ
    కలిమిలేముల వ్యధ
   మనిషి కి వచ్చేబాధ

 84. కాకినాడ  కాజ వృద్ధి
      బందరు లడ్డు ప్రసిద్ధి
       పూతరేకులు ప్రసిద్ధి
       కోనసీమ కొబ్బరి వృద్ధి

85.. మాట్లాడ కూడదు చెత్త
      ఉంటుంది మన మేనత్త
      ఊరికి మనమంత కొత్త
       తీసుకోవాలి జాగ్రత్త


86.ఉన్నత ఆశయాల సిద్ది
     మనిషి కావాలి బుద్ధి
      రహదారులలో రద్ది
       మేలైన కలప మద్ది.

 87.. నాగరికత మోజు
       నగుబాటు పోకు
       సంప్రదాయ రివాజు
        మరచిపోబోకు.

 88.పర్యావరణాన్ని
      పరిరక్షించాలి
      కాలుష్యాలన్ని
       నిర్మూలించాలి.

 89. సప్త స్వరాల వీణ
       అందాల తెలంగాణ
       కవి అందరికీ ప్రేరణ
       అతివ ఆత్మీయ జాణ

90..  శివ భక్తుడు కన్నప్ప
        భూ జల సంచారి కప్ప   
         మన మాతృభాష గొప్ప  
            నీటి న తేలేది తెప్ప     

91. కవితాసాహిత్య వాణి
    ‌‌  సౌరభాల పూ బోణి
     గులాబీ పూల కి రాణి
     సప్తస్వరాల రాగిణి

 92. చింతకాయ పులుపు
      యువతీయువకుల వలపు
      పేరంటానికి పిలుపు
     ‌ పూస్తారు కాళ్ళకు పసుపు

93. ప్రజలంతా  మెచ్చేవి
      అందరికీ ఇచ్చేవి
      బజారులో తెచ్చేవి
  ‌‌     పండ్లు మనం తినేవి.

 94.మహాభారతమయసభ
సుందర దృశ్యాల శోభ
కష్ట కాలాల క్షోభ
శ్రీ కరాల శ్రీ శుభ

 95.అందాల చీర కట్టు
సాంప్రదాయానికి మెట్టు
అతివకు ఆయువుపట్టు
ముఖ సింగారపు బొట్టు.


 96.మన చింతలన్ని తొలగు
కోటి దీపాలు వెలుగు
గుడ్డి కన్న మెల్ల మెరుగు
సఖ్యతతో ఇరుగుపొరుగు.

97. రామారావు నటుడు
        నవరసాల నాయకుడు
        నటనకే వారసుడు
         కళామతల్లి కుమారుడు

      98..సంధ్య గోధూళి వేళ
      ఇంటింటా దీప కళ
      అమ్మ గుడిలో మేళ
      గాయకుల సుందరగళ

99  దేవ దేవా శివాయ
        అవని లో నీ మాయ
        నీ పూజలు చేసేమయ
        ఆశీర్వాదించుమయ.

100.అనుభవించేది వ్యక్తి
తెలివి కలవాడి యుక్తి
 భక్తుల  లో పల  భక్తి
 మహాఋషి చెప్పే సూక్తి

 101.శత్రువులకు ఉంది కక్ష
    నేరానికి ఉంది శిక్ష
     వందవంద లే లక్ష
    భిక్షువులకు ఉంది భిక్ష

102. పుష్పవిలాప కరుణశ్రీ
       మహా ప్రస్థానశ్రీశ్రీ
       ఉత్తమ బిరుదుపద్మశ్రీ
       విజయమే జయశ్రీ.

103. తేనెతెలుగు మన భాష
      జగాన  కరోనా ఘోష
     ఎండకి వస్తుంది శోష
     అనిరుద్దుని భార్య ఉష

104..ప్రతి జీవి లో ఆత్మ
మనిషి లో జీవాత్మ
మనసేఅంతరాత్మ
విధాత నే పరమాత్మ

105.సంపద తో విరాజిల్లు
     పసి పిల్లల బొమ్మరిల్లు
     తల్లిదండ్రుల పుట్టిల్లు
       తోట లో పూ పొదరిల్లు

106.ఆకాశాన వేగుచుక్క
       నేలమీద చక్కని చుక్క
       వధూవరుల బుగ్గ చుక్క
       పండ్లకు ఉంటుంది తొక్క

107.ఆకాశము లో రవి 
       సాహిత్య ము లో కవి
        గులాబి పూలలో తావి
       చిగురలతో గున్న మావి
 108.    తల్లిదండ్రులు  దైవాలు
         ఎన్నో జన్మల బంధాలు
    ‌     మానవతా మూర్తులు
        తీర్చుకోలేని ఋణాలు

109.అమరశిల్పి జక్కన్న
   ‌     కవి  అల్లసాని పెద్దన్న
         పేరుగాంచిన వారున్న
         భారత చరిత్ర కి మిన్న

 110స్వచ్ఛమైన ముత్యాలు
  ‌       అందమైన హారాలు
          సుందర మైనరాగాలు
            మధురమైన భావాలు

111.ధవళముత్యాల హారము
     ‌‌   మది మెచ్చిన మోదము
  రాసాను ముత్యలహారము   
అందుకున్నాను పురస్కారం
  

0/Post a Comment/Comments