నిమజ్జనం ఎలా చేయాలి,దాని పారమార్ధం ఏమిటీ -వైద్య శేషారావు

నిమజ్జనం ఎలా చేయాలి,దాని పారమార్ధం ఏమిటీ -వైద్య శేషారావు

నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి దాని ఆంతర్యం
తొమ్మిది రోజుల్స్ పాటు వినాయక విగ్రహాన్ని భక్తి తో పూజించి ఊరేగింపుగా తీసుకవెళ్లి నీటిలో కలిపివేయడం బాధగా ఉంటుంది సాంప్రదాయం ఆచారం ఇది.ఉత్సవాలల్లో మట్టితో,ప్లాస్టిక్ ,పింగాణీ,ఇతర వస్తువుల తో తయారు చేస్తారు. అదే అలయాలల్లో, గృహంలో పెట్టుకునే విగ్రహాలను లోహాల తో తయారు చేస్తారు. వాటిలో ఇనుము,గూడ సత్తు,ఉక్కులను వాడారు పంచలోహ విగ్రహాలను కానీ,కంచుని,వెండి,బంగారం వాడుతారు.అవి శాశ్వతంగా ఉంచి పూజలు చెయ్యడానికి పనికి వస్తాయి. ఇంట్లో అయితే తొమ్మిది అంగుళాలు కు ఎక్కువ వాడ వద్దు అంటారు.
     అందుకే తొమ్మిది రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ప్రవహించే నీటిలో కానీ లోతైన నీటిలో కానీ నిమజ్జనం చేస్తారు
    ఎప్పుడు చెయ్యాలి అని మొదటి రోజు నుంచే పంతుళ్ళను అడుగుతుంటారు
   మొదటి రోజు సాయంత్రం నిమజ్జనం సాయంత్రం చేయవచ్చు మంగళవారం, శుక్రవారం వస్తే కదిలించి తెల్లవారు నిమజ్జనం చేస్తారు కొంత మంది 3 వ రోజు,5వ రోజు ,7వ రోజు,9 వ రోజు చేస్తారు. దీనికి  కారణం బేసి సంఖ్య ఉన్న రోజు ప్రామాణికంగా తీసుకుంటారు.భాగిస్తే శేషం ఒక్కటిగా వస్తుంది.హిందూ సంప్రదాయంలో దేవుడు ఒక్కడే అనే అర్థం వస్తుంది
      అయితే సంప్రదాయం తుంగలో తొక్కబడుతుంది.దేవి నవరాత్రుల రోజు ఉన్నంత భయంగా ఉండరు.ఇది తప్పు
తాగి,మత్తులో నృత్యాలు చేయడం తప్పు .ప్రారంభం రోజు ఎంత భక్తి శాస్ట్రోదేకంగా చేస్తారో సంప్రదాయం అనుసరిస్తే బాగుంటుంది.ఇది అసాధ్యం అయింది ఏమికాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఘననాథుణ్ణి నీటిలోకి జారవిడిచే ముందు'శ్రీ గణేశ0 ఉద్వాసయామి' శో భ నార్థం పున రాగ మ నాయచ అని చెప్పుకోవాలి
   నిమజ్జనం కు అంతరార్ధం ఉంది.ఎన్నో అలంకరాలతో,అలంకరణలతో మనం పొచించుకొనే ఈ శరీరం తాత్కాలికం అని,మూణ్నాళ్ల ముచ్చటే అనే సత్యాన్ని వినాయక నిమజ్జనం తెలియచేస్తుంది
    ఉమశేషారావు పంతులు
    లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments