షాడో ప్రక్రియ. ---తేజస్విని బలివాడ

షాడో ప్రక్రియ. ---తేజస్విని బలివాడ

        తెలుగు సాహిత్యంలో వినూత్న ప్రక్రియలు రూపొంది తద్వారా భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయి.


            వాటిలో షాడోలు ప్రక్రియ ఒకటి.ఈ ప్రక్రియ రూపకర్త శ్రీ యనగందుల దేవయ్య గారు.వీరు తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తూనే సమకాలీన అంశాలపై రచనలు చేస్తున్నారు.వీరు టి.పి.టి.ఎఫ్.రాష్ట్ర మాసపత్రిక ఉపాధ్యాయ దర్శినికి
సంపాదకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

            షాడోల నేపథ్యం, వాటి లక్షణాలు తదితర అంశాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
     
షాడోల రూపకల్పన నేపద్యం:

ఒకప్పుడు సాహిత్యం అనేది పండితుల చేతులలో వారి ప్రతిభను నిరూపించుకునే ఓ సాహిత్య క్రీడ మాత్రమే.19వ శతాబ్దం వచ్చేసరికి సాహిత్య విలువలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సమాజ అవసరాలు మారాయి. అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాలు రాజ్యాధికారాలు రాజుల చేతిలోనుండి ప్రజలచేతిలోకి వచ్చాయి. పారిశ్రామికీకరణ జరికగి ప్రజావసరాలకు అవసరమైన వ్యవస్థలు తెరపైకివచ్చాయి. ఆ నేపద్యంలో ప్రజల సమస్యలను అవసరాలను ఎత్తిచూపే బృహత్తర కార్యక్రమం నిర్వర్తించగల, మాధ్యమంలో అవసరమైనది అది చారిత్రక అవసరం కూడా ఆ సమయంలో కవిత్వం తన స్వరూపం మార్చుకొని సామాజిక బాధ్యతను తను తలకెత్తుకుంది.అప్పటినుండి నేటి వరకు తన బాధ్యతను అంతకంతకు బలంగానే నిర్వహిస్తుంది. అయితే సమాజ అవసరాలు ఎప్పుడూ ఒకేలా వుండవు అవి నిరంతరం మారుతుంటాయి. పాశ్చాత్య భాషా సంస్కృతులు సాంప్రదాయాలు మన మీద మన భాషా సంస్కృతులమీద సాహిత్యాలపైన పడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ప్రజల జీవన విధానం మరీ వేగవంతమైంది. వీటన్నిటి నుండి భాషను సాహిత్యాన్ని కొంత అప్ డేట్ చేయాల్సిన అవసరం వుంది. ఆధునిక విద్యావిధానంలో భాగంగా పాఠ్య పుస్తకాలను వ్యవహారిక భాషలోనే రాయాలనే నియమం వచ్చాక. కవిత్వంలో కూడా సాధ్యమైనంత వరకు క్లిష్టతలను తొలగించాల్సిన అవసరం వుంది. స్పీడుయుగం కనుక ప్రతిప్రక్రియను తగ్గించి సూక్ష్మంలోనే మోక్షం కలిగించేల కవిత్వం మారాల్సిన అవసరం వందినిగమనించాను. అప్పటికే నానోలు నానీలులాంటి లఘుప్రక్రియలు సాహిత్య ప్రచారంలో వుండటం కూడా నా ఆలోచనకు బలాన్ని చేకూర్చాయి. కాబట్టి మనదైన మార్క్ గల ఓ ప్రక్రియను రూపొందిస్తే బాగుంటుందనిపించింది. దానిలో భాగంగా నేను రూబాయిలు, గజళ్ళు, దోహాలు రాస్తున్నప్పుడు మనసులో మెదిలిన ఆలోచనే షాడోలు రూపొందడానికి కారణమైంది. అదేంటంటే, గజళ్ళలో వున్న క్లిష్టతను తొలగించి నామముద్రను మాత్రమే స్వీకరించి సులభం చేయాలనుకున్నాను, తర్వాత రుబాయిలో వున్న రథీఫ్ కాఫియాలను ప్రాసగ స్వీకరించాను. తర్వాత దోహ సైజులో చిన్నిది గాను చమత్కారంగాను వుండాలను కున్నాను. అందరూ రాయగల సరళత పదికాలాలు నిలిచేలా మాత్రలను ఏర్పాటు చేసాను. అలా తయారు అయిందే షాడో. షాడో అంటే క్రీనీడ అని అర్థం. మన పేరును మోసుకు వెళుతుంది గనుక మన షాడో అయింది. ఇప్పుడందరికి ఇంగ్లీషు మీద మోజు ఎక్కువైంది గనక ఇంగ్లీషు పేరుతోనే వెళ్ళి తెలుగు వాకిళ్ళలోకి ఆహ్వానించటం కూడా మరొక ఉద్దేశం.

షాడో లక్షణాలు:

1. ఇది 4పాదాలు గల లఘురూప ప్రక్రియ
2. ఇందులో 1,2,3 పాదాల చివర ప్రాస వుండాలి
ప్రతి పాదంలో 7 మాత్రలుండాలి.
3. చివరి పాదంలో ప్రాస లేదు. నామముద్రతో కలిపి 12 మాత్రలుండాలి.చమత్కారమైన ముగింపు సాధించాలి.

ఇలాగే మరొకటి
1. 1,2,3 పాదాలో ప్రాస8 మాత్రలుండాలి
2. 4వ పాదమునకు ప్రాసలేదు నామ ముద్రతో కలిపి 14 మాత్రలు
అలాగే చమత్కారమైన ముగింపు వుండాలి.

ఉదాహరణకు:
వలపు సొగసరి
వయసు గడసరి
మనసె మృదుమరి
కలల తేలిపొ మహదేవ

1. బతుకు చివరన
తంత్రి గొంతున
తోడు యాచన
ఎంత ఘోరమొ మహదేవ
2. గొంతు పెగలదు
పాట పలకదు
ఆశ తీరదు
నీ దయ చూపు మహదేవ
3. దేవా కనవు
వేదన వినవు
బతుకే బరువు
ఎందుకు తనువు మహదేవ
4. బతుకు నాటకం
జగము బూటకం
ఏమి నీటకం
నీకో సరదా మహదేవా
5. ఆశ తీరనిది
శ్వాస కోరినది
ధ్యాస మారనిది
నీలొ కలిపేయ్ మహదేవ
6. కాలు కదలదు
పొయ్యి వెలగదు
ఆశ తరగదు
పాపం ఎవరిదో దేవ
7. బ్రతుకులు భారము
దొరకదు తీరము
ఏమిటి ఘోరము
కాలమహిమేన మహదేవా
8. కథలు మారేన
వెతలు తీరేన
రొదలు ఆరేన
ఎంతటి శాపమ మహదేవా
9. కలలు విరిగేను
నిజము కరిగేను
ఆశ ఉడిగేను
దిక్కు నీవేను మహదేవా
10. నిన్న మనదాయె
నేడు ప్రశ్నాయె
రేపు లేదాయె
బ్రతుకు మాయేను మహదేవా
11. చేరిన వారిని
కోరిన వారిని
చేరగ వారిని
తిరిగి రాలేవ మహదేవా
12. ఏమిటి శాపము
ఎందుకు కోపము
ఎవరిది పాపము
ఆదుకోలేవ మహదేవా
13. భక్తియే నీది
రక్తియే నీది
ముక్తియే నీది
ఇహపరాలు నీవె మహదేవ
                           
                                  ------తేజస్విని బలివాడ 

0/Post a Comment/Comments