మానవ విజ్ఞాన నిధి --పసుమర్తి నాగేశ్వరరావు

మానవ విజ్ఞాన నిధి --పసుమర్తి నాగేశ్వరరావు

మానవ విజ్ఞాన నిధి

మెదడులో మస్తిష్కం విజ్ఞాననిధి
అదే ప్రసాదిస్తుంది జ్ఞాననిధి
అదే మనిషిలో తరగని తరతరాల నిధి
మానవుని మహోన్నత స్థితికి చేర్చే అపురూపనిది

మెదడుకు విజ్ఞానపు విత్తును  పుస్తకం అందిస్తుంది
అజ్ఞానపు అంధకారపు తిత్తును తొలగిస్తుంది
మానవజీవితపు విలువలను పెంపొందిస్తుంది
మృగ్యమైన జీవితాలకు భవితవ్యం నిర్ధేశిస్తుంది

ఈ రోజు మనిషి ఉన్నతస్థితికి చేరడానికి
జ్ఞానం తో విజ్ఞానం పరుగెత్తడానికి
కాలం తో మనిషి ముందుకు వెళ్ళడానికి
అస్తిత్వం నుండి స్థిరత్వం పొందడానికి పుస్తక విజ్ఞానమే

ఎంతటి జ్ఞానాన్నైనా విజ్ఞానాన్నైనా
నిక్షిప్తం చేసేది మస్తిష్కం
నిత్యం అనునిత్యం మస్తిష్కం లో పెరిగే వృద్ధి పుష్కలం
బుద్ధి సాఫల్యత నైపుణ్యత కుశలత విజ్ఞాన నైజం
అది మానవుని లో మాత్రమే వుందనుట నిజం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు
           విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments