అంతుపట్టని వింత దేవుని చిత్రాలు విచిత్రాలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి.కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా

అంతుపట్టని వింత దేవుని చిత్రాలు విచిత్రాలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి.కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా

 .తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్. 9491387977.


అంతుపట్టని వింత దేవుని చిత్రాలు
------------------------------------------
అంతుపట్టని వింత దేవుడు గణపతి
ఆయనతోనే ఇక మన అందరి సోపతి
పూజించి పెంచుకుందాం మన పరపతి
ఇలలో పెరిగి పోవు మన అందరి ఖ్యాతి!
పరంధామా పరం బ్రహ్మ పరేశం పరమేశ్వరమ్
విఘ్ననిఘ్నకరం శాంతం పుష్టంకాంత మనంతకమ్
సురాసురేంద్రైస్తుతంస్తామి పరాత్పరం
సురపద్మదినేశం చ గణేశం మంగళాయనమ్ !

ఈ శ్లోకంతో మనం గణపతిని స్మరించి 
ఆ వింత దేవుని చిత్రవిచిత్రాలు తెలుసుకుందాం.

వింత వింత దేవుడు
అంతుపట్టని దేవుడు 
మనందరి ఏకదంతుడు
ఘణ సద్గుణ వంతుడు !

వింత వింత దేవుడు
వినోదాల దేవుడు
విఘ్నహరాయుడు
ప్రజ్ఞ ప్రమోద రాయుడు !

చిత్రమైన దేవుడు
విచిత్రమైన దేవుడు
త్రినేత్ర గుణ దేవుడు 
జ్ఞాన నేత్రానందుడు !

చిట్టెలుకే ఆయన వాహనం
తానధిష్టించు సింహాసనం
సిధ్ధిబుధ్ధి అను రమణుల
తాను చేసుకునె వివాహం !

పూర్ణ కుంభం లాంటి దేహం
బానలాంటి పెద్దనైన ఉదరం
చేటల్లాంటి పెద్ద పెద్ద చెవులు
మంచి చెడ్డలచూపే తావులు !

ప్రథమ కర మందు పాశం
ద్వితీయ మందు అంకుశం
తృతీయ మందు మోదకం
చతుర్థిలో స్వంత దంతం  !

చిత్రవిచిత్రమైన దేవుడు
మన చిత్రాల ఈ దేవుడు
ఆత్మ ఆనందాల జీవుడు
సదా స్మరించే మన దేవుడు!

ఉండ్రాళ్ళను తినిపిస్తాడు
గుంజీలను తీయిస్తాడు
సుద్ది బుద్దిని అందిస్తాడు
మంద బుద్ధుల బందిస్తాడు!


గణపతిని, ముక్కోటి దేవతలు న్నా
మనం మొట్టమొదట పూజిస్తాం.
ఆ మహా గణపతినే స్మరిస్తాం
ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిసుత పరిశీలనకు, మేధస్సుకు
సంకేతాలు, ఆయన వక్రతుండం
ఓంకార ప్రణవనాదానికి ప్రతీక.
ఏనుగు లాంటి భారీ ఆకారాన్ని మోస్తున్నది మాత్రం చిట్టెలుక.
ఎంత చిత్రం ఎంత విచిత్రం ఆయన లీలా వినోద విన్యాసం, ఆత్మ చమత్కారం. ఆయన పొట్ట చుట్టూ

చుట్టుకొని ఉండే నాగము శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వాలకు సంకేతం. చేతుల్లో ఉన్న పాశం, అంకుశం, బుద్ధి మనసులను సన్మార్గంలో నడిపించే సాధనాలు. మరి రండి చేతుల్లోని మోదకం, దంతం మానవుల మనసుల విజ్ఞానానికి, శారీరక దృఢత్వానికి ,మెతక తనానికి సాంకేతికాలు. గణపతి కి మూడు కళ్ళు. మూడవ కన్నే జ్ఞాననేత్రం.
సిద్ధి బుద్ధుల ద్వారా విజ్ఞానాన్ని వినోదాన్ని అందించే, ఆనందసిద్ధి ని చేకూర్చే మన ఈ వినాయకున్ని సదా మనం  పూజిద్దాం, స్మరిద్దాం, సేవిద్దాం, జన్మంతా తరిద్దాం. !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ .9491387977.
 నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments