గురువు గొప్పదనం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

గురువు గొప్పదనం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

గురువు గొప్పదనం..!(కవిత)

నా గురువులు గొప్పొల్లు..!
నాకెంతో మేలు చేశారు..!
నాకు జ్ఞాన బోధ చేసి,
నా ఉన్నతికి, 
కారణభూతులయ్యారు..!
నాజీవితానికి అర్థం తెలిసి వచ్చింది..!
అక్షర జ్ఞానం తో మొదలుపెట్టి జీవిత పర్యంతం గుర్తుంచుకునే పాఠాలు బోధించారు..!
నాలోనూ ఒక దివ్యమైన బృహత్ రోజు... నేను కూడ ఒక
"గురువు" గా 
అవతరిస్తానని ఎన్నడూ అనుకోలేదు..! 
నాలో "గురువు"ను ఆవిష్కరించిన ఘనత నా తల్లి దండ్రుల తో పాటు నా గురువు కు కూడ 
దక్కితీరుతుంది..!
ఒక ఉత్తమ, 
సమాజ నిర్మాణంలో గురువు పాత్ర ఎంతో ఉంటుంది..!
గురువు స్థానం ఎల్లప్పటికీ విశిష్టమైంది..!
ఒక పద్ధతి,ఒక రీతి,ఒక నీతి, క్రమశిక్షణ, 
మంచి వ్యక్తిత్వం ..కేవలం ఒక "మంచి ఉపాధ్యాయుడి" లో మాత్రమే దర్శించగలం..!??
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు..!


✍🏻విన్నర్
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments