ఓ పాటల పిపాసి జోహార్లు
ఏదివిలో వెలసిన పారిజాతమో!
ఈ భువిలో వెలసి గానలహరి
మనకందించిన ఘనుడు
తన గానంతో పసందుచేశాడు
మనసులో చెలగని ముద్ర వేశాడు
ఘంటసాల లేడే
ఎలా ఇక అని తెలుగు సినిమా
ఘోషించింది కన్నీరు పెట్టింది
ఓ గాత్రం అప్పటికే వచ్చింది
ఓ వటవృక్షం నీడన మరుగున ఉండి
ఆ వటవృక్షం నేలకొరగగానే
అనతి కాలంలో
ఎదిగి మరో వటవృక్షమయ్యింది
ఓ పెనుగాలి విరుచుకు పడింది
పెకలించింది ఈ వటవృక్షాన్ని
లోకమంతా ఏడ్చింది
ఆ చితిమంటల్లో
గాత్రం చితాభస్మమయ్యింది
మనకైతే నిత్యం వినపడుతూనే ఉంది
ఆ మధురమైన గానం
ఆ నిండు చందమామలాంటి మోము
బుల్లి తెరలో నిత్యం చూస్తున్నాం
యు ట్యూబ్ అనే ప్రక్రియలో
క్షణాల్లో వీరు కనబడతారు
ఈ గాత్రం పాడుతూనే ఉంది
పాడుతా తియ్యగా అంటూ
మన గుండె నిండుగా
బుల్లి తెరలో స్వరాభిషేకం
అంటూ ఎన్నో వారాలు
తన పాటతోనే కాక మాటతోనూ అలరించారు
యన్టీఆర్ కు గంభీరం మేళవించి
ఎఎన్నార్ కి ఒక యాశతో
ఎవరికి ఎలా పాడాలనో
అలా పాడుతూ
ఆబాలగోపాలాన్ని ఓ అర్ద శతాబ్దం
అలరించిన గాన గంధర్వుడు
పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
నేనొక పాటల పిపాసిని అంటూ
కనికరంలేని కరోనా బారిన పడ్డాడు
వీరి వర్దంతి నేడు
స్మరిద్దాం ఓ మారు
డా వి.డి.రాజగోపాల్
9505690690
ఏదివిలో వెలసిన పారిజాతమో!
ఈ భువిలో వెలసి గానలహరి
మనకందించిన ఘనుడు
తన గానంతో పసందుచేశాడు
మనసులో చెలగని ముద్ర వేశాడు
ఘంటసాల లేడే
ఎలా ఇక అని తెలుగు సినిమా
ఘోషించింది కన్నీరు పెట్టింది
ఓ గాత్రం అప్పటికే వచ్చింది
ఓ వటవృక్షం నీడన మరుగున ఉండి
ఆ వటవృక్షం నేలకొరగగానే
అనతి కాలంలో
ఎదిగి మరో వటవృక్షమయ్యింది
ఓ పెనుగాలి విరుచుకు పడింది
పెకలించింది ఈ వటవృక్షాన్ని
లోకమంతా ఏడ్చింది
ఆ చితిమంటల్లో
గాత్రం చితాభస్మమయ్యింది
మనకైతే నిత్యం వినపడుతూనే ఉంది
ఆ మధురమైన గానం
ఆ నిండు చందమామలాంటి మోము
బుల్లి తెరలో నిత్యం చూస్తున్నాం
యు ట్యూబ్ అనే ప్రక్రియలో
క్షణాల్లో వీరు కనబడతారు
ఈ గాత్రం పాడుతూనే ఉంది
పాడుతా తియ్యగా అంటూ
మన గుండె నిండుగా
బుల్లి తెరలో స్వరాభిషేకం
అంటూ ఎన్నో వారాలు
తన పాటతోనే కాక మాటతోనూ అలరించారు
యన్టీఆర్ కు గంభీరం మేళవించి
ఎఎన్నార్ కి ఒక యాశతో
ఎవరికి ఎలా పాడాలనో
అలా పాడుతూ
ఆబాలగోపాలాన్ని ఓ అర్ద శతాబ్దం
అలరించిన గాన గంధర్వుడు
పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
నేనొక పాటల పిపాసిని అంటూ
కనికరంలేని కరోనా బారిన పడ్డాడు
వీరి వర్దంతి నేడు
స్మరిద్దాం ఓ మారు
డా వి.డి.రాజగోపాల్
9505690690