కీర్తి ప్రతిష్టలు - మార్గం కృష్ణ మూర్తి

కీర్తి ప్రతిష్టలు - మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: కీర్తి ప్రతిష్టలు


వస్తువు
ఉపయోగాన్ని బట్టి
విలువ!

చెట్టు 
ఔషద గుణాన్ని బట్టి
గుర్తింపు!

స్త్రీ 
అందాన్ని బట్టి
ఆకర్షణ!

మనిషి
చేసే పని తనాన్ని బట్టి
ప్రతిష్ఠ!

విలువ,కీర్తి 
పలుకుబడి‌,పేరుప్రతిష్ఠలు
కావు భూమిలో 
మొలిచే మొలకలు
కావు దుకాణంలో 
దొరికే ఏలకులు
కావు ఆకాశంలో 
కనిపించే నక్షత్రాలు!

కీర్తి ప్రతిష్ఠలు  
జనులందరికీ అసాధ్యం
గొప్పసేవలకు ,గొప్ప రచనలకు,
దానాలకు లభించే అరుదైన కిరీటం!

స్వాతంత్ర్య సమరయోధుడు
ఉధ్యమకారుడు , చైతన్యపరుడు 
పోరాట వీరుడు , దేశ భక్తుడు
ధైర్యశాలి , ప్రతిభాశాలి , ప్రాణత్యాగశీలి
అభ్యుదయ భావాలు గల ఉధ్యమకారుడు
షోషలిస్టిక్ రిపబ్లికన్ పార్టీ సభ్యుడు
హిందుస్థాన్ సామ్యవాద సంఘ స్థాపకుడు
భగత్ సింగ్  సేవలు అద్భుతం
వీరి ,కీర్తి ప్రతిష్ఠలు ,అజరామరము!

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments