మనసు మాట వినదు ....మీను

మనసు మాట వినదు ....మీను

బాధ తప్త హృదయం నన్ను బాధ పెడుతున్న.,..,
ఆ.....హృదయ వేదన...నా...భావాల ఆలోచన.

నా మదిలో
అలలై ఎగిసి పడుతున్న

చెప్పు కోలేని భావాలెన్నో....నా మనస్సు గోడలపై చెదరని అక్షరాలు గా రాసుకుంటున్న....

ఎన్ని రోజులకైనా ఆ పాత మధుర జ్ఞాపకం గా ఉండి పోవాలని....

అంతరంగ ఆలోచనలో ఒక మెరుపుల అయినా వచ్చి వెళ్తానని.......

నీ కనులు వెతికే చూపులో చివరి కైనా కనిపిస్తానని నీ చూపుకు అందుతానని ఎదురు చూస్తూ.......
అందనంత లోకాలకి వెళ్లే చివరిశ్వాస వరకు ఎదురు చూస్తూ ........ఉంటూ......

మీను....



0/Post a Comment/Comments