కాలుష్య రక్కసి
ఉరుకుల పరుగుల జీవితాలు
మనిషి అలసత్వానికి సాక్షీభూతాలు బాధ్యతారాహిత్య జీవనాలు
జూలు విడిచి సై అంటున్న కాలుష్య రక్కసులు//
వీనువీదీలో విషపు గాలులు
గగనాన గరళపు వాసనలు
ఫ్యాక్టరీ గొట్టాల పొగలు సెగలు
డంపింగ్ యార్డ్ లో చెత్తకుప్పలు
పుడమిలో ఇంకిన రసాయన వ్యర్థాలు ముక్కులు మూసుకుపోయే మురికి కంపులు మానవాళికి వినాశకాలై
ముంచుకొస్తున్న ప్రమాదాలు //
పంచభూతాలను విషతుల్యం చేసి కాటు వేస్తున్న కాలుష్య భూతం
అర్రులు చాచి భూగోళాన్ని బంధిస్తున్న వైనం అడుగడుగున నేనున్నానంటూ భయపెడుతున్న తరుణం//
ఆ ఉన్మాదానికి ఉరిశిక్షను అమలు చేసి
పర్యావరణ పరిరక్షణ చేపడతాం/
కృతిమ కాంతులలో యంత్రాలుగా బ్రతుకునీడ్చకా
సేంద్రియతను పునరుద్ధరించి సహజత్వాన్ని మేలుకొలుపుతూ/
ప్రజా రవాణాకు లాభము చేకూర్చి రణగొణ సవ్వడిని నీ దరి రానివ్వకు/
చెత్త ను రీ సైకిల్ చేసి పునర్వినియోగం చేపట్టి
నాసికలకు విముక్తి కల్పించి పరిమళాల పండుగ చూడూ//
అడవులకు మించిన ఆస్తి లేదంటూ అరణ్య రక్షణకై తోడ్పడు /
ప్రకృతి పచ్చదనం లో మమేకమై నవ్వుల పువ్వులతో విరాజిల్లు. //
పేరు:ఐశ్వర్య రెడ్డి గంట,
వృత్తి:మేనేజ్మెంట్ కన్సల్టెంట్
ఊరు:హైదరాబాద్ ,