కలం - పరవశం ---దొడ్డపనేని శ్రీ విద్య

కలం - పరవశం ---దొడ్డపనేని శ్రీ విద్య

కలం- పరవశం

పరవశించిన ప్రకృతి సోయగం కోసమో
అబ్బుర పరిచే పరిసర ప్రభావం వల్లనో
మైమరుపుతో స్వప్నం చిలికించిన భావమో 

రవివర్మ చిత్రించిన చిత్రం  భావుకతనో
ప్రభావ పరిచిన సుందర సన్నివేశమో
అభిమానం నింపిన ప్రేమ పూర్వక బంధమో

మనసు కదిలించిన స్నేహ గీతిక ప్రభావమో
పసిప్రాయంలో మది పై ముద్ర పడిన జాలమో
మానవత్వ పరిమళాల దృశ్య కావ్యమో
మలినాలు నిండిన సమాజాన్ని ప్రశ్మించే ఉద్దేశ్యమో

కన్నీరు నిండిన బాలుడి వదనమో
కల్మషం ఎరుగని పసిపాప ముఖ సౌందర్యమో

నా చేతి కలం నుంచి జల జలా జాలువారిన అక్షర కుసుమాలు
నన్ను ఇంతలా కదిలించిన దృశ్యమాలికలు

మౌనంగా మురిసిన వేళ...
నా కవిత్వం మాటలకందని భావుకతతో అక్షర రూపం దాల్చిన వేళ

ద్రవించనే నా కవి హృదయం
నన్ను అలరించనే జన ఆత్మీయం

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
07/09/2021


0/Post a Comment/Comments