•••గురువు•••
అక్షరాలను అలవోకగా దిద్దించావు
వంకరగా రాసిన
తప్పుగా రాసిన
నా చేయి పట్టి నేర్పించావు
నేను అల్లరి చేసిన
మారాం చేసినా
కోపంగా చూసినా
ఓపికతో సహించి
నా అజ్ఞానాన్ని క్షమించి
నాలోని జ్ఞాన జ్యోతులను వెలిగించావు
మట్టి ముద్దల వున్న నాకు
ఈ సమాజంలో
ఒక రూపాన్ని
ఒక గౌరవాన్ని కల్పించావు
కాని
ఓ గురువర్యా!
నీవు మాత్రం అదే బెంచి
అదే కుర్చీలో కూర్చొని
నల్లటి బోర్డు పై తెల్లటి రాతలతో
విద్యార్థుల నుదిటి రాతను
మార్చే విధాతవై
ప్రపంచానికే వెలుగు పంచుతున్నావు...
•••శ్రీపాల్•••
8978894808