ధరలు..గుండె దడలు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ధరలు..గుండె దడలు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ధరలు..గుండె దడలు..!(కవిత)

రేట్లకు రెక్కలొచ్చి ఎగిరెగిరి పడుతున్నాయి..!
పెట్రోల్ సల సలా మండి, బండి నల్లటి పొగలు గ్రక్కుతున్నది..!?
గ్యాసు బండ నేమో.. పెరుగుదల దండ నిత్యం తొడుగుతున్నది..!?
కాగుతున్న నూనెలు ఇప్పట్లో సల్ల బడేటట్లు అగుపించ కున్నవి..!??
బీద సాదలు లోబిదిబో మంటున్నారు..!
మధ్య తరగతి ప్రజలకు ఏమీ అర్థం కాక పిచ్చి లేసినట్లున్నది..!??
ఏమి ఈ ధరలు..!?
ఏమి ఈ బతుకులు..!??
ఎవరూ ఏమియు అంటలేరని పెంచుకుంటూ పోతున్నారా.. ఏంటి..!???
మౌనం అంగీకారం అనుకున్నారా ఏమిటీ.. కొంప కాలి..!??
ఎంత సేపూ రేట్లు పెంచే మాటనే గాని..
తగ్గించే ఊసే లేదాయే..!??
ఖర్మ కాలి..! ఛ..!
ధరలు కావు ఇవి, గుండె దడలు..!???

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.


0/Post a Comment/Comments