మమతల ఒడి...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)

మమతల ఒడి...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)

మమతల ఒడి...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)

హృదయ స్పందనల ప్రేమామృత రాగాల పల్లకి
విచక్షణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వ వారధి
కమ్మని కబుర్లు కథలతో నిద్రపుచ్చే చల్లని స్పర్శ నిధి
క్రమశిక్షణ భయం భక్తుల అభ్యసనాల బడి
కుటుంబమనే హరివిల్లు లో సప్త వర్ణాల గర్భ గుడి
ఇలలో స్వర్గమైన పూదోట పరిమళాల మడి
తరతరాల జ్ఞాపకాల దొంతరల సవ్వడి
వంశ వృక్షపు పచ్చదనాల ఆనందాల లోగిలి
మనవండ్ల మనవరాండ్ల సుఖ సంతోషాల వాకిలి
వీటన్నిటి కలబోతల మణిహారమే...
అమ్మమ్మ నానమ్మ తాతయ్యల మమతల ఒడి...!

0/Post a Comment/Comments