సద్గురువులు
(గజల్)
1. మంచిచెడుల భేదములను
వివరించును సద్గురువులు
జ్ఞానజ్యోతి మనసులోన
వెలిగించును సద్గురువులు
2. తిమిరములను రూపుమాపి
వెలుగునిచ్చు మేధావిగ
అక్షరాల పూతోటలొ ఆడించును సద్గురువులు
3. మట్టి ముద్ద బాలలనూ
మనసు పెట్టి మలచు చుండు
సుందరముగ శిల్పములూ
చూపించును సద్గురువులు
4. అక్షరమే ఆయుధంగ లక్షణములు గమనించుచు
విద్యార్థుల విజయాలకు
సూచించును సద్గురువులు
5. చిరునవ్వుల చెల్లదనము
కురిపించును దినము దినము
నీతి నేర్పు కథలు ఎన్నొ
వినిపించును సద్గురువులు
6. నవ యువతకు నాణ్యమైన
బాట వేసి చూపగలడు
క్రొవొత్తిగా తాను మారి రాణించును సద్గురువులు
7. అలుపెరుగని శ్రామికుడుగ
అహర్నిశలు శ్రమపడుతూ
ఆణి ముత్యముల కొరకూ
జీవించును సద్గురువులు
వివరించును సద్గురువులు
జ్ఞానజ్యోతి మనసులోన
వెలిగించును సద్గురువులు
2. తిమిరములను రూపుమాపి
వెలుగునిచ్చు మేధావిగ
అక్షరాల పూతోటలొ ఆడించును సద్గురువులు
3. మట్టి ముద్ద బాలలనూ
మనసు పెట్టి మలచు చుండు
సుందరముగ శిల్పములూ
చూపించును సద్గురువులు
4. అక్షరమే ఆయుధంగ లక్షణములు గమనించుచు
విద్యార్థుల విజయాలకు
సూచించును సద్గురువులు
5. చిరునవ్వుల చెల్లదనము
కురిపించును దినము దినము
నీతి నేర్పు కథలు ఎన్నొ
వినిపించును సద్గురువులు
6. నవ యువతకు నాణ్యమైన
బాట వేసి చూపగలడు
క్రొవొత్తిగా తాను మారి రాణించును సద్గురువులు
7. అలుపెరుగని శ్రామికుడుగ
అహర్నిశలు శ్రమపడుతూ
ఆణి ముత్యముల కొరకూ
జీవించును సద్గురువులు
--పేరు అద్దంకి లక్ష్మీ
ఊరు ముంబై
సెల్ నెంబరు
9 7 5 7 0 4 3 4 6 9
ఊరు ముంబై
సెల్ నెంబరు
9 7 5 7 0 4 3 4 6 9