అవసరం కొద్దీ సలాంలు..!(కవిత) -ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అవసరం కొద్దీ సలాంలు..!(కవిత) -ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అవసరం కొద్దీ సలాంలు..!(కవిత)
******✍🏻విన్నర్******
అరే,నా డబ్బుని చూసి గౌరవం చూపించకురా..!??
అలాంటి ఆదరణ నాకొద్దు..!
అరే,నా ఆస్తులు అంతస్తులు చూసి సలాం చేయకురా..!?
అలాంటి గౌరవం నాకొద్దు..!
అరే,నా సాయం కోరి నన్ను దండాలు కొట్టకురా..!??
అరే,నా దావత్ లకు 
ఆశపడి నమస్తేలు 
చేయకురా..!??
అలాంటి గౌరవాన్ని నేను
ఇష్టపడను..!
నా హోదాను,
నాఉద్యోగాన్ని,
నాపదవులను..ఇత్యాదిని దర్శించి నన్ను గౌరవించకు..!
అలాంటి ఆదరణ నాకొద్దు..!
నా మంచితనాన్ని,
నా మానవత్వాన్ని,
నా వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు..!
నా విలువలని చూసి..గౌరవించండి..అప్పుడు అంగీకరిస్తాను
అలాంటి ఆదరణనే కోరుకుంటాను.. మనస్ఫూర్తిగా..!
నాకొద్దు..ఈ అవసరం కొద్దీ సలాములు..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments