పౌష్టికాహారం క్షేమము(సున్నితాలు)-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

పౌష్టికాహారం క్షేమము(సున్నితాలు)-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

పౌష్టికాహారం క్షేమము
 -------------------------------------
సంపూర్ణ ఆరోగ్యం అవసరము
అనారోగ్యం చేయాలి దూరము
'పౌష్టికాహారం' తినిన క్షేమము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

పిల్లలలోన ఎదుగుదల ఉండదు
వృద్ధుల్లో  బలమే కానరాదు
పోషకాలు దూరమే కారాదు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఆరోగ్యమే ప్రభుత్వం లక్ష్యము
పోషక పదార్థాలున్న లాభము
ఆకుకూరలలో అవే లభ్యము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

తినాలోయ్ మెండుగ చిరుధాన్యాలు,
పలు పీచుపదార్థాలు,మాంసకృత్తులు
అప్పడే బాగుపడు జీవితాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

"పౌష్టికాహార" లోపం శాపము
తగ్గునోయ్ మానసిక సామర్ధ్యము
అవుతుందోయ్ నరకమే  జీవితము
చూడచక్కని తెలుగు సున్నితంబు!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments