ప్రకృతిలో పారవశ్యం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ప్రకృతిలో పారవశ్యం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ప్రకృతిలో పారవశ్యం..!(కవిత)

చంద్రుని చల్లని 
వెన్నెల రాత్రులలో..!
చల్లని గాలులు వీస్తున్నాయి..,
మెల మెల్లగా..!
చల చల్లని రాగాలు మదిలో 
మ్రోగుతున్నాయి..! 
భలే భలేగా..!
ఆ తారల మిణుకు మిణుకు మనుట.. !
కళ్ళు మిరుమిట్లు గొలుపుట..!
జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటూ ఉండాలి..
అప్పుడు గాని,
ఏదైనా మనస్సుకి నచ్చదు..!??
ప్రకృతి ఒడిలో..!
ఈ జీవిత బడిలో..!
ఎన్నెన్ని
బోధనలు..,పాఠాలు
మధురానుభూతులు..!?
ఎన్నెన్ని ఆశలూ,ఆకాంక్షలు, ఆశయాలు..!?
ఆ చంద్రుడు..ఆ సూర్యుడు..
ఆ తారలు...ఆ ప్రకృతి ఆకర్షణలు..!
అన్నీ ఆ
దేవుడి లీలలు..!
ఆలోచనలు నిలిచిపోయాయి..నిదురలో జారుకున్నాను..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments