ఓ మనిషీ నీ వెవరు?

ఓ మనిషీ నీ వెవరు?


శీర్షిక: ఓ మనిషీ నీవెవరు?

విశ్వంలో  నవగ్రహాలు 
ఆకాశంలో పక్షులు
అడవుల్లో జంతువులు
మలయమారుతాలు
తరువులు
నదులు
వేటి పని అవి 
విశ్రాంతి లేకుండా 
సాగిపోతున్నాయి

సూర్యభానుడు ఏమి ఆశించకుండా 
సూర్య రశ్మి ని వెదజల్లుతున్నాడు

రేయంతా చంద్రుడు నిస్వార్ధంతో  
పిండి వెన్నెలను కురుపిస్తున్నాడు

జీవనదులు ఏమి ఆశించకుండా 
ప్రాణాధారమైన అమృతాన్ని
జీవకోటికి అందిస్తున్నాయి

అను నిత్యం తరువులు 
ప్రకృతిసిద్ధంగా ఫలాలను 
మరెన్నిటినో ,  సకలప్రాణులకు
ఏమి కోరకుండా అందిస్తున్నాయి

ఎన్నిటినో , ఎందరినో మోస్తూ
మనుషులు చేసే పాపాలను చూస్తూ
భరిస్తున్న భూమాత , ఏమి ఆశిస్తుంది?

జంతువులు పక్షులు జీవకోటి , మనిషికి
యెన్నో విధాలుగా ఉపయోగ పడుతున్నాయి
ఏమి ఆశించి? ఏమీ లేదే....

పుట్టేటపుడు ఏమీ తీసుకుని రాని
గిట్టే టపుడు ఏమి తీసుక పోలేని
మనిషీ నీవెవరు?

నీ బ్రతుకేదో నీవు చూసుకుంటూ
నీ స్వార్ధ మేదో నీవు చూసుకుంటూ
భూ కబ్జాలు చేస్తూ , మోసాలు చేస్తూ
ప్రతి పనికి , ప్రతి ఫలం ఆశిస్తూ
రేపటి పది తరాలకు కూడ బెడుతూ
పోయే నీవు ఎవరివి?

ఎవరికీ ఉపయోగ పడవు,
ఇతర ప్రాణులకు హాని చేయకుండా ఉండలేవు
స్వార్ధం లేకుండా జీవించలేవు
అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళేవాడివి
జీవితం శాశ్వితం కాదని తెలిసి
బంధాలన్నీ  కొన్నాళ్ళే నని యెరిగిన
మనిషీ నీ వెవరివి?

నీవు ఎవరో నీకు తెలియదు
ఎవరికి ఉపయోగ పడాలో తెలియదు
ఎందుకు స్వార్ధంతో జీవిస్తున్నావు?
ఎవరి కొరకు భూకభ్జాలు చేస్తున్నావు?
సంపదలు ఆస్తులు కూడబెడుతున్న 
ఓ మనిషీ నీవెవరివి?

నీకు నీవే ప్రశ్నించుకో 
నీవెవరో తెలుసుకో
స్వార్ధం వీడు
పరులకు ఎంతో కొంత మేలు తలపెట్టు
జీవించినంత కాలమైనా సంతృప్తితో ఉండు

మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments