మన జెండా -డాక్టర్ అడిగొప్పుల సదయ్య

మన జెండా -డాక్టర్ అడిగొప్పుల సదయ్య

ఒక దేశ గౌరవము ఒకదేశ శౌర్యమును
ఒకదేశ రాజసము ఒకదేశ పౌరుషము

ఒకదేశ కర్షకము ఒకదేశ వర్తకము
ఒకదేశ గాంభీర్య మొకదేశ ఔదార్య

మొకదేశ సౌందర్య మొకదేశ సౌశీల్య
మొకదేశ ఔన్నత్య మొకదేశ ఐశ్వర్య

మొకదేశ సఖ్యతయు ఒకదేశ ఐక్యతయు
ఆదేశ జెండాన అగుపించు రూపమై

భరతదేశపు జెండ భాగ్యరాశుల కుండ
మూడు రంగులు జల్తు మురిపించు హృదినిండ

పింగళీ వెంకన్న ప్రియమైన సృష్టియై
భరతాంబ చేతిలో భవ్యంగ యెగిరేను

భరత దేశపు కీర్తి భరతదేశపు మూర్తి
అవనిలో నినదిస్తు ఆకాశమున ఎగురు

హిమనగోన్నతమునను ఇనుమడించిన శక్తి
శిరమెత్తి యెగిరెను శివమెత్తి మన జెండ...

కవనశ్రీ చక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట, కరీంనగర్
9963991125

0/Post a Comment/Comments