సమరయోధుడు - విప్లవ సాహిత్యవేత్త --వి. కృష్ణవేణి

సమరయోధుడు - విప్లవ సాహిత్యవేత్త --వి. కృష్ణవేణి


సమరయోధుడు - విప్లవ సాహిత్యవేత్త 

తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడై...
నిజాం నిరంకుశ పరిపాలనలో
కలాన్ని కత్తిగా పట్టి తన రాతలతో..
ఉద్యమాన్ని చేసి రజాకారుల గుండెల్లో
గుబులు పుట్టించిన మరో మహా బాపూజీగా..
వీర తెలంగాణ నా వేరు తెలంగాణ అని 
రంగులు దిద్దిన చిత్రకారుడుగా..
గ్రాంధాలయాల నిర్మాణంలో కృషి చేసి
మహనీయుడై..
అలుపెరగని శ్రామిక కవనమై 
స్ఫూర్తిదాయక చారితార్దుడుగా...
రాజకీయ సాంఘీక చైతన్యాల సమాహారమై 
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన
స్వాతంత్ర సమరయోధుడై...
కలముతో గలమెత్తి కాగితాన్నికత్తిగా కరముగాపట్టించి..
విప్లవకవిగా సాహిత్యాన్ని సుసంపన్నంచేసి..
తన రచనల ద్వారా సమాజాన్ని జాగృతిపరుస్తూ..
చావుపుట్టుకల నడుమ జీవితాన్ని తెలంగాణకు 
అంకితమిచ్చిన నిస్వార్థమేధావిగా..
మానవతావాదిగా...
ఒక్క చిర్రాచుక్కతో స్తబ్దుగా ఉన్న లక్షమెదళ్ళలో
విస్పాటనం సృష్టించవచ్చని..
పీడితప్రజల పక్షాన్న గళమెత్తిన నిస్వార్థ స్వరమై..
తెలంగాణయాసకు జీవంపోసిన వైతాళికుడుగా...
తెలంగాణరాష్ట్ర సాధనోద్యమానికి శ్రీకారం చుట్టిన ఉద్యమకర్తగా..
తెలంగాణగడ్డపై చెరగని ముద్రవేసుకున్న కాళోజీ 
నిత్యచిరస్మరనీయుడే ...

వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా.

కాళోజీ జయంతి సందర్భంగా
ప్రక్రియ: వచనం


 

0/Post a Comment/Comments