నా గుప్పెడంత మనసు

నా గుప్పెడంత మనసు

నా గుప్పెడంత మనసు

ప్రేమ రాహిత్యం దరి చేరిన వేళ
దూరాల్ని పెంచుతూ
భారాల్ని మదికి  దగ్గర చేరుస్తూ

రవి కిరణాలు చీకటిని పటాపంచలు చేసినట్టు
అందమైన తామరలు విచ్చుకుంటున్నట్టు
అక్షర జలం లో నా మనసు తడుస్తున్నా
మది లోని భావ తృష్ట తనివి తీరదే

ప్రకృతి అలజడికి స్పందించెనే
స్వప్న విహంగమై ఎగిరిపోయనే

నిక్షిప్తమైన ప్రేమధారలలోని
తియ్యదనాన్ని ఆస్వాదిస్తుంటే
గతం కళ్ళ ముందు మొదులుతుంటే

క్షణ కాలం జీవిత అనుభూతులన్నీ
కంటి ముందు వెల్లివిరుస్తుంటే
నన్ను నీకు పరిచయం చేసిన క్షణాల్ని
దు:ఖాశ్రువులు హత్తుకుంటుంటే

గ్రీష్మ తొలకరి తాపాన్ని చల్లబరుస్తుంటే
వెన్నెల వెచ్చదనంలో సేద తీరుతుంటే

మనసుకు రెక్కలు తొడిగినట్టు
విహంగమై ప్రేమ శిఖరాన్ని తాకుతున్నట్టు

సవ్వడి చేసే భావ తరంగాలు నామదిలో...
సరి క్రొత్తగా నిన్ను పరిచయం చేయగా

ఎక్కడో జార విడుచుకున్న మధుర స్మృతుల జ్ఞాపకాలకై
పలుకుల అమృతాన్ని మది దోసిళ్ళతో అందుకునేందుకై

నా గుప్పెడంత మనసు ఒదిగిపోయే నీ ఒడిలో

--దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
11/09/2021
శనివారం

0/Post a Comment/Comments