విశ్వశాంతి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

విశ్వశాంతి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

విశ్వశాంతి

బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్చామి
సత్యం శివమ్ సుందరం
సత్యమేవజయతే ఇవి విశ్వశాంతి కోరే ప్రవచనాలు

కుల మత వర్గ వైషమ్యాలుకు తావీయకుండా
ధనిక పేద భేదం లేకుండా
ఆడ మగ తారతమ్యం లేకుండా
సమ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలి
రామాయణ భాగవత గీతా సారాంశాలు వివరించాలి
వేదాలు ఉపనిషత్తుల విలువలు జగతికి తెలియజేయాలి
మానవ నైతికవిలువలు ఉపదేశించాలి
చైతన్యం కలిగిన జీవిత సారాంశ విషయాలు భోధించాలి

సర్వమానవ సౌబ్రాతృత్వం సూచనలు చేయాలి 
విశ్వసనీయత కలిగిన విశ్వజనీనత అంశాలు సాధించాలి
వసుధైక సామ్రాజ్య స్థాపనకు కృషిచేయాలి
సబ్ క మాలిక్ ఎక్ అని ప్రభోదించాలి

మృధత్వం మధురత్వం లాంటి తత్వబోధనలు
ఏకతత్వం సమానత్వం సౌబ్రాతృత్వం లాంటి విలువలు
కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు లాంటి అర్ధాలు
సానుకూలతతో తెలియచెప్పాలి

బుద్ధుడు వివేకానందుడు చెప్పిన సూక్తులు వ్యక్తీకరించాలి
గాంధీ నెహ్రు కలాం వంటి వారి తత్వాన్ని తెలిజెప్పాలి
వివిధరకాల శాంతిమార్గాన్వేషణ జరపాలి
అప్పుడే జరుగుతుంది విశ్వశాంతి

రచన'పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments