అక్షరాభిషేకం ---దొడ్డపనేని శ్రీ విద్య

అక్షరాభిషేకం ---దొడ్డపనేని శ్రీ విద్య


అక్షరాభిషేకం

*సంపద కంటే విజ్ఞానం గొప్పది*
పంచే కొలదీ సంపద తరుగుతుంది

పంచిన కొలదీ జ్ఞానం అధికమవుతుంది
ఉన్నతికి అక్షరం ఎంతో దోహదపడుతుంది

నిరక్షరాస్యతను నిర్మాలించి మార్గదర్శకం అవుతుంది
జీవితానికి దారి చూపే గమ్యమవుతుంది

నశించనది ఒక్కటే అక్షరం
ఉద్యమానికి అదే ఆయుధం

మనిషిని మహోన్నతుడిగా అక్షరం తీర్చుతుంది
ఆత్మవిశ్వాసం తో మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది

అక్షర జ్ఞానం తో నలుగురికి జీవితం ఇవ్వు
అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్జానదీప్తివి అవ్వు

తెలంగాణా ఒక చారిత్రక వైభవ శిఖరం
ఉద్యమాల గర్జన లో జయకేతనం

చదువే దేశ రక్షణకు ఆయుధం
జన జీవన విధానంలో ఓ కాంతి దర్శనం

అక్షరాలతో మొదలవుతాయి గెలుపు మెట్లు
జీవన సౌధానికి అవే ప్రగతి గట్లు

అక్షరాస్యతతో ప్రపంచాన్ని గెలవగలము
నలుగురిలో మన గౌరవమును పెంచుకోగలము

జ్ఞానాన్ని మన నుంచి వేరు చేయలేము

*నేడు అక్షరానికి అభిషేకం*
*చరిత్రలో అక్షరం శాశ్వతం*
✒️📝📖📒📗✒️

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
09/09/2021
గురువారం

0/Post a Comment/Comments